Inspiring Telugu Stories – తెలుగు కథలు
రెండూ రాళ్లే! ఒకటి, మూలవిరాట్టె గర్భగుళ్లో పూజలందు కుంటోంది. రెండోది, గుడిముందు గడపై భక్తుల కాళ్లకు అడొస్తోంది. ఎందుకీ తేడా? నేను చేసిన తప్పేమిటి? నిన్ను మొక్కడం ఎందుకు? నన్ను తొక్కడం ఎందుకు? ‘ అడిగింది గడప..

‘మిత్రమా…. గుర్తుందా? ఒకప్పుడు మనిద్దరం ఒకే కొండమీద ఉండేవాళ్లం. ఒక మహాశిల్పి మన కొండకొచ్చాడు. శిల్పంగా మలిచే ప్రయత్నంలో, ఉలితో ఒక్కదెబ్బ వేయగానే నొప్పి తట్టుకోలేక నువ్వు కుప్ప కూలిపోయావు. నేను మాత్రం నిబ్బరంగా నిలబడ్డాను. దేవతామూర్తిగా రూపుదిద్దు కున్నాను. ఆ గాయాల్ని అనుభవించిన ఫలమే ఇది…’ వివరించింది విగ్రహం.. వైఫల్యమంటే, పోరాటంలో ఓడిపోవడం కాదు. పోరాడే ప్రయత్నమే చేయకపోవడం!
Like and Share
+1
2
+1
1
+1