ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Inspiring Stories in Telugu
ఓ పిల్లవాడు బుట్టెడు గుడ్లతో సైకిల్ మీద పోతూ దారిలో ఒక బండరాయిని గుద్దుకొని పడిపోయాడు. బుట్టెడు గుడ్లు పగిలి పోయాయి. ఆ అబ్బాయి చుట్టూ జనం మూగి,” ఇంకొంచెం జాగ్రత్తగా పోవాలి కదా”, “చూసుకోకుండా ఎక్కడో ఆలోచిస్తూ తొక్కితే ఏమౌతుంది” వంటి ఉచిత సలహాలు, విమర్శలు చేస్తున్నారు.
ఒక వృద్ధుడు అది చూసి “అయ్యయ్యో పాపం, గుడ్లన్నీ పగిలి పోయాయే ! ఆ గుడ్ల యజమానికి ఏం జవాబు చెప్తాడు. పోనీలే! నేను కొంత సహాయం చేస్తాను,” అంటూ ఓ 20 రూపాయలు ఇచ్చి “ఇక్కడ ఈ చోద్యం చూస్తున్న చాలా మంది మంచివాళ్ళు, హృదయం ఉన్నవాళ్ళు, వాళ్ళు కూడా తోచింది ఇస్తారులే, తీసుకో అబ్బాయి.” అన్నాడు.
వృద్ధుడి మాటలకు జనం జాలిపడి, తోచింది ఎంతో కొంత ఇచ్చి పోయారు. “ఆ పెద్దమనిషి లేకపోతే నీకు చాలా సమస్యలు వచ్చేవి కదా” సానుభూతి చూపించాడు ఒకతను. “సార్…. ఆయనే మా యజమాని, నేను వాళ్ళ షాప్ లోనే పని చేస్తున్నాను, ఈ గుడ్లు వాళ్ళవే.”
జీవితంలో ఒక్కోసారి అనుకోని సమస్యలు ఎదురవుతాయి. అయితే తెలివైన వాళ్ళు కష్టాలకు బెదిరి పోరు, కొత్త ఆలోచనలతో గట్టెక్కుతారు.
సేకరణ -V V S Prasad
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లైతే తప్పకుండా షేర్ చెయ్యండి.
Inspiring Stories in Telugu