Inspiring Stories in Telugu
ఒక అధ్యాపకుడు ఇద్దరు విద్యార్ధులకు ఒక పరీక్ష పెట్టడానికి అడవి గుండా వెళ్ళే మార్గం దగ్గరకు ఉదయాన్నే రమ్మన్నాడు. విద్యార్థులు అక్కడికి చేరుకున్న తర్వాత “ఈ రోడ్డు నుండి బయల్దేరి అవతలి వైపుకు చేరుకోవాలి. ముందు చేరుకున్న వాళ్ళు విజేతలే, కానీ వచ్చే వారం పెట్టే పరీక్షలో దీని ప్రభావం ఉంటుంది” అని చెప్పారు.
విద్యార్థులు ఇద్దరూ పోటీకి ఒకే సారి బయలుదేరారు. కొంత దూరం పోగానే దారి రెండుగా చీలిపోయింది. మొదటి విద్యార్థి సులభమైన దారి ఎంచుకొని పరుగు పెట్టాడు. రెండో విద్యార్థి రెండోదారి ఎంచుకున్నాడు. దారంతా గుంటలు, ఎత్తుపల్లాలు, అడ్డంగా రాళ్ళు, దుంగలు ! మొదటి విద్యార్థి వేగంగా విజయతీరం అందుకొని, సరైన మార్గం ఎన్నుకున్నానని గర్వంగా విజయ బావుటా ఎగరేసాడు.
రెండో విద్యార్థి ఇబ్బందులను అధిగమించి విజయతీరం చేరుకొన్నాడు. అధ్యాపకుడు చిరునవ్వుతో వచ్చే వారం జరిగే రెండో పోటీకి సిద్ధంగా ఉండమన్నాడు. ఆ రోజు రానే వచ్చింది. టీచర్ ఒక కాలవ చూపించి, “దీని మీదినుండి అవతలి గట్టు మీదికి దూకాలి”.
మొదటి విద్యార్థి ఆ కాలవ వెడల్పు చూసి బెంబేలెత్తిపోయి చేతులెత్తేశాడు. రెండో విద్యార్థికి మొదటి పోటీలో వచ్చిన అనుభవం వల్ల ధైర్యం వచ్చి ఊపిరి తీసుకొని ఒక్క ఎగురు ఎగిరి అవతలి గట్టుకు దూకేసాడు. మొదటి పోటీలో సులభమైన దారి ఎన్నుకొని మొదటి విద్యార్థి విజయతీరం చేరుకొన్నాడు. రెండో విద్యార్థి అడ్డంకులను, కష్టాలను ఎదుర్కొన్నాడు. అందుకే రెండో పోటీ అలవోకగా గెలిచి విజేత అయ్యా డు.
జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను ధైర్యంగా ఎదుర్కోవాలి. అప్పుడే నిజమైన విజయం లభిస్తుంది.
సేకరణ – V V S Prasad
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లైతే తప్పకుండా షేర్ చెయ్యండి.
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.