Menu Close

క్రికెట్ ఇండియా 2025 పూర్తి షెడ్యూల్ – ఎవరితో, ఎప్పుడు తలపడుతుంది – India Upcoming Matches


క్రికెట్ ఇండియా 2025 పూర్తి షెడ్యూల్ – ఎవరితో, ఎప్పుడు తలపడుతుంది – India Upcoming Matches

ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్ ముగిసింది. ఐపీఎల్ ముగిసిన వెంటనే ప్రారంభమైన ఈ సిరీస్.. ప్రేక్షకులను విశేషంగా అలరించింది. ప్రతీ మ్యాచ్ కూడా ఐదు రోజుల పాటు సాగింది. అది చూస్తేనే చెప్పొచ్చు.. ఈ సిరీస్ అభిమానులకు ఎలాంటి మజాను అందించిందో. ఈ నేపథ్యంలో టీమిండియా తర్వాత క్రికెట్ షెడ్యూల్ ఏంటి అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. దీనిపై పూర్తి విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం..

Rohit Sharma

2025 ఆసియా కప్ (సెప్టెంబర్ 9 – సెప్టెంబర్ 28)

ఆసియా కప్ 2025తో టీమిండియా షెడ్యూల్ మొదలవుతుంది. ఈ టోర్నమెంట్ దుబాయ్ వేదికగా జరగనుంది.

  • సెప్టెంబర్ 10: భారత్ vs యూఏఈ (మొదటి మ్యాచ్)
  • సెప్టెంబర్ 14, సెప్టెంబర్ 19: ఈ రెండు తేదీల్లో లీగ్ స్టేజ్ మ్యాచ్‌లు జరగనున్నాయి.
  • ఆ తర్వాత, గ్రూప్-4 మరియు ఫైనల్ మ్యాచ్‌లు ఉంటాయి. ఈ టోర్నమెంట్‌లో ఎవరు గెలుస్తారో చూడాలి!

వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్ (అక్టోబర్ 2 – అక్టోబర్ 14)

ఆసియా కప్ ముగిసిన వెంటనే, టీమిండియా రెండు టెస్ట్ మ్యాచ్‌ల కోసం వెస్టిండీస్‌తో తలపడనుంది.

  • మొదటి టెస్ట్ (అక్టోబర్ 2-6): అహ్మదాబాద్
  • రెండో టెస్ట్ (అక్టోబర్ 10-14): ఢిల్లీ

ఆస్ట్రేలియా టూర్ (అక్టోబర్ 19 – నవంబర్ 8

టెస్ట్ సిరీస్ తర్వాత, టీమిండియా వన్డే మరియు టీ20 సిరీస్‌ల కోసం ఆస్ట్రేలియాకు పయనం కానుంది. ఆసీస్ గడ్డపై గెలవడం ఎప్పుడూ కష్టమే. ఈ సిరీస్ ప్రేక్షకులకు పరుగుల పండగను అందించడం ఖాయం!

వన్డే సిరీస్:

  • మొదటి వన్డే (అక్టోబర్ 19): పెర్త్
  • రెండో వన్డే (అక్టోబర్ 23): ఆడిలైడ్
  • మూడో వన్డే (అక్టోబర్ 25): సిడ్నీ

టీ20 సిరీస్:

  • మొదటి టీ20 (అక్టోబర్ 29): కాన్‌బెర్రా
  • రెండో టీ20 (అక్టోబర్ 31): మెల్‌బోర్న్
  • మూడో టీ20 (నవంబర్ 2): హోబార్ట్
  • నాలుగో టీ20 (నవంబర్ 6): గోల్డ్ కోస్ట్
  • ఐదో టీ20 (నవంబర్ 8): బ్రిస్బేన్

దక్షిణాఫ్రికా టూర్ ఆఫ్ ఇండియా (నవంబర్ 14 – డిసెంబర్ 19)

ఆస్ట్రేలియా టూర్ ముగిసిన వెంటనే, టీమిండియా స్వదేశానికి తిరిగి వచ్చి దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ సిరీస్‌లో టెస్ట్, వన్డే, టీ20 మ్యాచ్‌లు ఉన్నాయి.

టెస్ట్ సిరీస్:

  • మొదటి టెస్ట్ (నవంబర్ 14-18): కోల్‌కతా
  • రెండో టెస్ట్ (నవంబర్ 22-26): గువహటి

వన్డే సిరీస్:

  • మొదటి వన్డే (నవంబర్ 30): రాంచీ
  • రెండో వన్డే (డిసెంబర్ 3): రాయ్‌పూర్
  • మూడో వన్డే (డిసెంబర్ 6): విశాఖపట్నం

టీ20 సిరీస్:

  • మొదటి టీ20 (డిసెంబర్ 9): కటక్
  • రెండో టీ20 (డిసెంబర్ 11): ముల్లాన్‌పూర్
  • మూడో టీ20 (డిసెంబర్ 14): ధర్మశాల
  • నాలుగో టీ20 (డిసెంబర్ 17): లక్నో
  • ఐదో టీ20 (డిసెంబర్ 19): అహ్మదాబాద్

ఈ షెడ్యూల్ చూస్తుంటే, రాబోయే నెలల్లో టీమిండియా బిజీగా గడపనుందని తెలుస్తోంది. మరి మీ అభిమాన సిరీస్ ఏది? టీమిండియా విజయ పరంపర కొనసాగించాలని కోరుకుంటూ, ఈ మ్యాచ్‌ల కోసం ఎదురు చూద్దాం!

క్రికెట్ లో చాలా మందికి తెలియని రూల్స్ – Cricket Rules

Share with your friends & family
Posted in Cricket

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading