అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
Idi Teeyani Vennela Reyi Lyrics in Telugu
ఇది తీయని వెన్నెల రేయి
మది వెన్నెల కన్నా హాయి
నా ఊహల జాబిలి రేఖలు
కురిపించెను ప్రేమలేఖలు, ఊఊ ఊ
ఇది తీయని వెన్నెల రేయి
మది వెన్నెల కన్నా హాయి
ఆ ఆ హా హాహా ఆహా ఆహాహా
సుజా..!!
నడిరాతిరి వేళ… నీ పిలుపు
గిలిగింతలతో… నను ఉసిగొలుపు
నడిరాతిరి వేళ నీ పిలుపు
గిలిగింతలతో నను ఉసిగొలుపు
నును చేతులతో… నను పెనవేసి
నా ఒడిలో వాలును… నీ వలపు
ఇది తీయని వెన్నెల రేయి
మది వెన్నెల కన్నా హాయి
నా మనసే కోవెల చేసితిని
ఆ గుడిలో నిన్నే నిలిపితిని
నా మనసే కోవెల చేసితిని
ఆ గుడిలో నిన్నే నిలిపితిని
నీ ఒంపులు తిరిగే అందాలు
కనువిందులు చేసే శిల్పాలు
ఇది తీయని వెన్నెల రేయి
మది వెన్నెల కన్నా హాయి
నీ పెదవులు చిలికే మధురిమలు
అనురాగము పలికే సరిగమలు
నీ పెదవులు చిలికే మధురిమలు
అనురాగము పలికే సరిగమలు
మన తనువులు… కలిపే రాగాలు
కలకాలం నిలిచే కావ్యాలు
ఇది తీయని… వెన్నెల రేయి
మది వెన్నెల కన్నా హాయి
నా ఊహల… జాబిలి రేఖలు
కురిపించెను ప్రేమలేఖలు,ప్రేమలేఖలు
ఇది తీయని వెన్నెల రేయి
మది వెన్నెల కన్నా హాయి