ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
ఆ ఆఆ ఆ… ఆఆఆఆ ఆఆ
ఇది చెరగని… ప్రేమకు శ్రీకారం
ఆఆఆఆ ఆఆ
ఇది మమతల… మేడకు ప్రాకారం
ఓఓఓఓ ఓఓ ఓ
పండిన కలలకు శ్రీరస్తూ… పసుపు కుంకుమకు శుభమస్తు
కనివిని ఎరుగని అనురాగానికి… కలకాలం వైభోగమస్తూ
కలకాలం వైభోగమస్తూ…
ఇది చెరగని… ప్రేమకు శ్రీకారం
ఆఆఆఆ ఆఆ
ఇది మమతల… మేడకు ప్రాకారం
ఓఓఓఓ ఓఓ ఓ
పండిన కలలకు శ్రీరస్తూ… పసుపు కుంకుమకు శుభమస్తు
కనివిని ఎరుగని అనురాగానికి… కలకాలం వైభోగమస్తూ
కలకాలం వైభోగమస్తూ
కళ్యాణ గంధాలు… కౌగిలికి తెలుసూ
రసరమ్య బంధాలు… రాతిరికి తెలుసూ
పారాణి మిసమిసలు… పదములకు తెలుసూ
పడకింటి గుసగుసలు… పానుపుకి తెలుసూ
చిగురుటాశల… చిలిపి చేతలూ
పసిడిబుగ్గల పలకరింపులూ… పడుచు జంటకే తెలుసూ
ఇది చెరగని… ప్రేమకు శ్రీకారం
ఆఆఆఆ ఆఆ
ఇది మమతల… మేడకు ప్రాకారం
ఓఓఓఓ ఓఓ ఓ
పండిన కలలకు శ్రీరస్తూ… పసుపు కుంకుమకు శుభమస్తు
కనివిని ఎరుగని అనురాగానికి… కలకాలం వైభోగమస్తూ
కలకాలం వైభోగమస్తూ
ముగ్గులె తొలిపొద్దు… ముంగిళ్ళకందం
శ్రీవారి చిరునవ్వె… శ్రీమతికి అందం
మింటికి పున్నమి… జాబిల్లి అందం
ఇంటికి తొలిచూలు… ఇల్లాలు అందం
జన్మజన్మల… పుణ్య ఫలముగా
జాలువారు పసిపాప నవ్వులే… ఆలుమగలకూ అందం
ఇది చెరగని… ప్రేమకు శ్రీకారం
ఆఆఆఆ ఆఆ
ఇది మమతల… మేడకు ప్రాకారం
ఓఓఓఓ ఓఓ ఓ
పండిన కలలకు శ్రీరస్తూ… పసుపు కుంకుమకు శుభమస్తు
కనివిని ఎరుగని అనురాగానికి… కలకాలం వైభోగమస్తూ
కలకాలం వైభోగమస్తూ