కృత్రిమంగా మగ్గబెట్టిన మామిడి పండుని గుర్తించడం ఎలా – Identify Artificially Ripened Mangoes
రంగు:
సహజంగా మగ్గిన పండ్లకు రంగు కొన్ని చోట్ల పచ్చగా, కొన్ని చోట్ల పసుపు రంగులో వుంటుంది, పండు అంతా ఒకే రంగులో వుండదు.
కృత్రిమంగా మగ్గించిన పండ్లకు రంగు ఒకేలా వుండి బాగా బ్రైట్ గా నిగనిగలాడుతూ ఉంటుంది.

వాసన:
సహజంగా మగ్గిన మామిడి పండ్లకు ప్రత్యేకమైన తీపి వాసన ఉంటుంది.
కృత్రిమంగా మగ్గించిన వాటిలో మామిడి వాసన చాలా తక్కువగా లేదా అసహజంగా ఉంటుంది.
తొడుగు భాగం:
సహజంగా మగ్గిన మామిడి పండ్ల తొడుగు సన్నగా, బాగా ఎండినట్టుగా, తడి తడి గా ఉంటుంది.
కృత్రిమంగా మగ్గించిన పండ్ల తొడుగు బాగా పొడి పొడిగా, కొంచెం పచ్చగా, బలంగా కనిపిస్తుంది.
మెత్తదనం:
సహజంగా మగ్గిన పండు పట్టుకున్నప్పుడు కొంచెం మెత్తగా వుంటుంది.
కృత్రిమంగా మగ్గిన పండు చాలా గట్టిగా వుంటుంది.
కార్‌బైడ్ వాడకం:
కార్‌బైడ్ వాడిన పండ్లపై తెల్లగా పొడి పొడి మచ్చలు కనిపించవచ్చు. అలానే పండ్లకి కొంచెం అసహజమైన రుచి ఉంటుంది.
సహజ పండు లోపల కూడా పసుపు రంగులో ఉంటుంది.
కృత్రిమ మగ్గింపు వల్ల బయట రంగు అందంగా ఉన్నా, లోపల కొంచెం పచ్చిగా, తెల్లగా ఉండే అవకాశం ఉంటుంది.
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లైతే తప్పకుండా లైక్ చేసి షేర్ చెయ్యండి.
స్ట్రెస్ ని తగ్గించుకుని, ప్రశాంతంగా వుండడం ఎలా – Best Ways to Reduce Stress – Health Tips in Telugu
How to identify artificially ripened mangoes,
Artificial vs natural mango ripening,
Carbide ripened mango detection tips,
Signs of fake mango ripening,
Easy tricks to spot chemical mangoes.
కృత్రిమంగా మగ్గించిన మామిడి పండ్లు,
కార్బైడ్ మామిడి పండ్లు గుర్తించే విధానం,
నేచురల్ మామిడి vs ఫేక్ మామిడి,