నీలోని ప్రతిభ సమాజం ఎలా గుర్తిస్తుంది – లైఫ్ లెసన్స్ – బెస్ట్ స్టోరీస్ – 2025
How to showcase your skills to society: ఓ సన్యాసి గంగానది ఒడ్డున ఆశ్రమం ఏర్పాటు చేసి, ఎందరో శిష్యులకు విద్యాబోధన చేస్తున్నాడు. ఆయన దగ్గరకు ఎన్నో గ్రామాల నుండి ప్రజలు వారి సమస్యలు చెప్పుకోవడానికి వచ్చేవారు. ఒకరోజు, ఓ యువకుడు ఆయన దగ్గరికి వచ్చి ఇలా చెప్పాడు.
“స్వామీజీ, నా జీవితంలో సమస్యలు తీరటం లేదు. ఎంత కష్టపడినా, ఎవరూ గుర్తించడంలేదు. నా జీవితాన్ని ఎలా మార్చుకోవాలో అర్థం కావడం లేదు!”
ఆ సన్యాసి చిరునవ్వుతో ఆ యువకుడికి ఒక అరటిపండు చూపించి,
“ఈ అరటిపండు విలువ ఎంత వుంటుంది?” అని ఆ యువకుడుని అన్నాడు:
“దీని విలువ ఓ 5 రూపాయలు ఉంటుంది స్వామి” అన్నాడు ఆ యువకడు.
సన్యాసి ఆ అరటిపండును తొక్క తీసేసి, లోపల ఉన్న పండును యువకుడి చేతిలో పెట్టాడు.
ఇప్పుడు మళ్ళీ అడిగాడు
“ఈ అరటిపండు విలువ ఎంత?” అని.
దానికి ఆ యువకుడు
“ఇప్పుడది విలువలేనిది, ఎందుకంటే తొక్క లేకుండా ఎవరికీ ఇవ్వలేం. ఎవ్వరూ కొనరు” అన్నాడు.
స్వామి చిన్నగా నవ్వి..
“మనుషుల విలువ కూడా ఇంతే! నీలో అసలైన విలువ అరటిపండు, తొక్క కాదు. కానీ సమాజం మాత్రం నీ బాహ్య ఆకృతి (తొక్క) ఆధారంగానే నిన్ను అంచనా వేస్తుంది!”
“నువ్వు ఎంత గొప్పవాడివైనా, నువ్వు బయటకి ఎలా కనబడతావు, నీ ప్రవర్తన ఎలా వుంటుందో, నీ ఆత్మవిశ్వాసం ఎంత బలంగా వుంది అనేవి చూసి సమాజం నిన్ను గుర్తిస్తుంది.”
- మన నిజమైన విలువ మనకి మాత్రమే తెలుస్తుంది కానీ సమాజానికి అది కనిపించదు.
- మన వ్యక్తిత్వం బలంగా ఉంటేనే మన ప్రతిభ వెలుగులోకి వస్తుంది. అప్పుడే మన నిజమైన విలువని గుర్తిస్తారు.
- కేవలం ప్రతిభ వుంటే సరిపోదు ప్రతిభతో పాటు మంచి ప్రవర్తన, ఆత్మవిశ్వాసం కూడా వుండాలి.
- ఎప్పుడూ నీ వ్యక్తిత్వాన్ని, ప్రవర్తనను బలంగా ఉంచుకో.
- అప్పుడే సమాజం నిన్ను గౌరవిస్తుంది, గుర్తిస్తుంది.!
తక్కువ కష్టంతో ఎక్కువ ఫలితం – 80/20 రూల్ టిప్స్ – High Productivity Tips in Telugu