Menu Close

Himaseemallo Song Lyrics In Telugu – Annayya


Himaseemallo Song Lyrics In Telugu – Annayya

హిమసీమల్లో హల్లో… యమగా ఉంది ఒళ్ళో
మునిమాపుల్లోయల్లో… మురిపాల లోయల్లో
చలి చలిగా తొలి బలిగా ఈడే ధారపోశా
చలిమిడిగా కలివిడిగా అందాలారబోశా
అలకలూది రామచిలక పలుకగనే

హిమసీమల్లో హల్లో యమగా ఉందీ ఒళ్ళో
మునిమాపుల్లోయల్లో మురిపాల లోయల్లో
చలి చలిగా తొలి బలిగా ఈడే ధారపోశా
చలిమిడిగా కలివిడిగా అందాలారబోశా
అలకలూరి రామచిలక పలుకగనే

సోసో సాని సోయగమా… ప్రియ శోభనమా
సుఖ వీణ మీటుదమా..!
వావా అంటే వందనమా… అభివందనమా
వయసంతా నందనమా
మొహమాటమైనా నవ మోహనం
చెలగాటమైనా తొలి సంగమం

మది వగిలే హిమ మహిమ, ఓ ఓ ఓఓ
అది అడిగే మగతనమా… నీదే భామ
పడుచు పంచదార చిలక పలుకగనే
హిమసీమల్లో హల్లో… యమగా ఉంది ఒళ్ళో
మునిమాపుల్లో ఎల్లో… మురిపాల లోయల్లో

మా మా అంటే మాధవుడే… జత మాధవుడే
పడనీడు ఎండ పొడి
సా సా అంటే సావిరహే… బహుశా కలయే
నడిజాము జాతరలే

వాటేసుకుంటే వాత్సాయనం
పరువాల గుళ్ళో పారాయణం
రవి కలనే రచన సుమా, ఓ ఓ ఓఓ
సుమతులకే సుమ శతమా… నీవే ప్రేమా
పెదవి ప్రేమలేఖ లిపిని చదవగనే

హిమసీమల్లో హల్లో యమగా ఉంది ఒళ్ళో
మునిమాపుల్లోయల్లో మురిపాల లోయల్లో
చలి చలిగా తొలి బలిగా ఈడే ధారపోశా
చలిమిడిగా కలివిడిగా అందాలారబోశా
అలకలూది రామచిలక పలుకగనే

Like and Share
+1
1
+1
0
+1
0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading