ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
మానవుడికి అదే ఉత్తమ స్థితి – Heights of Human Life
అందరితో కలసి మెలసి ఉండడమే మానవ లక్షణం.
మనిషికి ఉన్న మంచి గుణాల వలన లోకంలో అతన్ని మన్నన పొందేలా చేస్తాయి.
రాముడు ధర్మ మార్గంలో నడచి ధర్మానికే ప్రతిరూపంగా మారాడు.
ధర్మం శరణం గచ్చామి..
అన్ని బుద్ధుడు ప్రభోదించాడు.
అదే లోకం అంతటికి శిరోధార్యం.
ఎందరో జనహితంకోసం పనిచేసి, చరిత్రలో చరితార్థులుగా వెలుగొందారు.
ఆత్మ విశ్వాసం పెంచుకుని అనుకున్నది సాధించే నేర్పు, ఓర్పు మనిషి కలిగిఉండాలన్నది శాస్త్ర వచనం.
పరోపకారబుద్ధితో, మంచి వైపు మొగ్గితే అదే దైవత్వం.
నేను, నా అనే భావన నుండి బయటపడి,
మనం అనే ఉత్తమభావన హృదయం లోపలినుండి వెల్లివిరియాలి.
అది శుభసూచికం. అదే మానవుడికి ఉదాత్తస్థితి కలిగిస్తుంది..!!