అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
Health Tips in Telugu – Curd Uses in Telugu
ఆరోగ్యమే మహా భాగ్యము
ఒకప్పుడు పెరుగు తింటే బరువు పెరుగుతాము అని చాలామంది తినడమే మానేశారు. అది ఒక అపోహ అని వైద్యులు చెప్పడంతో ఇప్పుడు చాలామంది నిర్భయంగా తింటున్నారు. అందుకు కారణం పెరుగులో పుష్కలంగా ఉండే కాల్షియం, అమైనో ఆమ్లాలు. ఇవి మీ రోగాలను నయం చేస్తాయి.

* పెరుగు తినడం వలన జీర్ణవ్యవస్థలో ఉండే ఇన్ఫెక్షన్‌ను అదుపులో ఉంచుతాను.
* పెరుగు తినడం వలన డైటరీ ఫ్యాట్‌అదుపులో వుంటుంది. ఆకలి అదుపులో వుంటుంది.
* పెరుగులో ఉన్న కాల్షియం, అమైనో ఆమ్లాలు కొవ్వును తగ్గిస్తాయి. వ్యాధి నిరోధకతను పెంచుతాయి.
* పెరుగు కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. ఎముకల్ని గట్టిగా ఉంచుతుంది.
* పెరుగులో ఉండే మాంసకృత్తులు, అమైనో ఆమ్లాలు అధిక బరువును అదుపులో ఉంచుతుంది, శరీర బరువును తగ్గిస్తుంది.
* చర్మం నిగనిగలాడేందుకు పెరుగుని వివిధ రకాలుగా ఉపయోగిస్తారు. చర్మ సౌందర్యంలో, చికిత్సలో ప్రముఖ పాత్ర వుంది.
* నిద్ర పట్టని వారికి పెరుగు ఔషధం. పెరుగు తింటే హాయిగా నిద్రపోతారని ఆయుర్వేదంలో కూడా చెప్పారు.
* పెరుగు తింటే మీరు ఎప్పుడూ యవ్వనంగా ఉంటారు.