పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల 9 రకాల ఆరోగ్య ప్రయోజనాలు – Health Benefits of Raw Onion
ఉల్లిపాయలో యాంటీ అలర్జీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఉల్లిపాయల్లో శరీరానికి అవసరమైన పొటాషియం, మాంగనీస్, కాపర్, విటమిన్ సి, విటమిన్ 6 ఉల్లిపాయల్లో పుష్కలంగా లభిస్తాయి.. మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ అంశాలు చాలా ముఖ్యమైనవి. ఉల్లిపాయలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల నరాల సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ఉల్లిపాయ బాక్టీరియల్ లేదా వైరల్ ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని రక్షిస్తుంది. ఇందులోని ఔషధ గుణాలు రోగనిరోధక శక్తిని పెంపొందించేందుకు తోడ్పడతాయి.పచ్చి ఉల్లిపాయలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. శరీరం నుండి విషాన్ని తొలగిస్తుంది. ఫైబర్ మలబద్ధకం మరియు మూలవ్యాధి సమస్యను తగ్గిస్తుంది.
ఉల్లిపాయ ఎముకలను బలపరుస్తుంది. కాల్షియం శోషణను పెంచుతుంది మరియు బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఎముకల ఆరోగ్యానికి , అల్జీమర్స్, నరాల సంబంధిత సమస్యలను ఇవి దూరం చేస్తాయి.
పచ్చి ఉల్లిపాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి, ఇవి చర్మ స్థితిస్థాపకతను పెంచుతాయి. ఉల్లిపాయల్లో చర్మం ముడతలు, వయస్సు మచ్చలు, పిగ్మెంటేషన్ తొలగించే గుణం ఉంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
పచ్చి ఉల్లిపాయల్లోని క్వెర్సెటిన్ , ఆర్గానిక్ సల్ఫర్ ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపించడానికి పని చేస్తాయి. మధుమేహం ఉన్నవారు తమ ఆహారంలో ఉల్లిపాయను చేర్చుకోవాలి.
ఉల్లిపాయల్లో కొన్ని రసాయనాలుంటాయి. క్వెర్సెటిన్ అనే రసాయనం ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పచ్చి ఉల్లిపాయలలో సేంద్రీయ సల్ఫర్ కంటెంట్ కనిపిస్తుంది. దాని రుచి, వాసన ఎక్కువగా ఉంటాయి. శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడానికి సేంద్రీయ సల్ఫర్ ఉపయోగపడుతుంది. రక్తం గడ్డకట్టడాన్ని విచ్ఛిన్నం చేయడంతోపాటు గుండె జబ్బులు , గుండె స్ట్రోక్‌లను నిరోధిస్తుంది.ఆంథోసైనిన్‌లతో సహా కనీసం 17 రకాల ఫ్లేవనాయిడ్‌లను కలిగి ఉంటుంది.
ఉల్లిపాయల్లో ఇనులిన్ అనే ఒక రకమైన ఫైబర్ ఉంటుంది. ఇది ప్రోబయోటిక్ గా పని చేస్తుంది. ప్రోబయోటిక్స్ ఉన్న ఆహారం పొట్టలోని మంచి బ్యాక్టీరియాకు చాలా అవసరం. ఇవి పోషకాల శోషణను పెంచుతాయి.
పొట్ట ఆరోగ్యాన్ని కాపాడడానికి రోజుకో పచ్చి ఉల్లిపాయ కచ్చితంగా తినాలి.జీర్ణ సమస్యలు ఉన్నట్లయితే ఉల్లిపాయలు తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. కాబట్టి, మీరు జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడానికి, పొట్టను ఆరోగ్యంగా ఉంచడానికి సలాడ్ రూపంలో ఉల్లిపాయను తినవచ్చు.
ఉల్లిపాయలు శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. ఉల్లిపాయలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. మీకు కడుపులో, ఛాతిలో మంట సమస్య ఉంటే మీరు పచ్చి ఉల్లిపాయను తీసుకోవచ్చు.
పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల 9 రకాల ఆరోగ్య ప్రయోజనాలు – Health Benefits of Raw Onion
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.