Menu Close

గులాబీ ఔషధ గుణాలు, ఇవి తెలుసా? Health Benefits

పువ్వుల్లో అందమైన పువ్వు గులాబీ అని వేరే చెప్పక్కర్లేదు. ఈ గులాబీ అందానికే కాదు ఔషధంగా కూడా మేలు చేస్తుంది. గులాబీలో ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా ఉన్నాయి.

గులాబీలు చర్మపు చికాకును తగ్గించడానికి సహాయపడుతాయి.
గొంతు నొప్పిని తగ్గిస్తుంది.

చర్మం ఎరుపుదనాన్ని, కమిలినట్లుండే చర్మానికి ఉపశమనం కలిగిస్తుంది.
అంటువ్యాధులను నివారించడానికి, చికిత్స చేయడానికి సహాయపడుతుంది.
ఇది యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది.
కోతలు, మచ్చలు, కాలిన గాయాలను నయం చేస్తుంది.
మానసిక స్థితిని దృఢపరుస్తుంది.
తలనొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది.
ఇవే కాకుండా… బాదంపాలతో గులాబీ రేకులు కలిపి తీసుకుంటుంటే రక్తపోటు తగ్గిపోతుంది. గులాబీ రేకుల్ని కొబ్బరి నూనెతో కలిపి వేడిచేసి చల్లారిన తర్వాత తిలకంగా పెట్టు కుంటే మెదడు చల్లబడటమే కాక జ్ఞాపకశక్తి పెరుగుతుంది. గులాబీలని హృద్రోగులు ఉన్న ప్రదేశంలో ఉంచితే వాటి నుంచి వచ్చే పరిమళం రోగాన్ని ఉపశమింప చేస్తుంది.
గులాబీ పువ్వుల నుండి ఆవిరి ద్వారా తీయబడిన నూనె, గులాబీ అత్తరుని పరిమళ ద్రవ్యాలలో కొన్ని శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. గులాబీ నూనె నుండి తయారయ్యే రోజ్ వాటర్‌ను వాడటం మనకు తెలిసిన విషయమే. గులాబీ పండ్ల నుండి తయారయ్యే గులాబీ పండు గింజ నూనెను, చర్మ మరియు సౌందర్య సంబంధ ఉత్పత్తులలో వాడుతారు.
ప్రతిరోజు భోజనానంతరం చాలామందికి ఒక్కపొడి వేసుకునే అలవాటు ఉంటుంది. అంతకన్నా గులాబీ రేకుల్ని నమిలితే జీర్ణప్రక్రియ సులభంగా అవుతుంది. వేసవి తాపం తీర్చుకునేందుకు కేవలం 10 గ్రాముల లోపు ద్రవాన్ని ఒక్కసారి మాత్రమే తీసుకుంటే మేలు కలుగుతుంది.

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
బిగ్గ్ బాస్ 8 తెలుగులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ?

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading