ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Gurtukostunnayi Lyrics In Telugu – Naa Autograph – గుర్తుకొస్తున్నాయి లిరిక్స్
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి…
ఎద లోతులో, ఏ మూలనో… నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి…
ఈ గాలిలో, ఏ మమతలో… మా అమ్మ మాటలాగ పలకరిస్తున్నాయి
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి…
మొదట చూసిన టూరింగ్ సినిమా… మొదట మొక్కిన దేవుని ప్రతిమ
రేగుపళ్ళకై పట్టిన కుస్తీ… రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ
కోతికొమ్మలో బెణికిన కాలు… మేక పొదుగులో తాగిన పాలు
దొంగచాటుగా కాల్చిన బీడీ… సుబ్బుగాడిపై చెప్పిన చాడీ
మోట బావిలో మిత్రుని మరణం… ఏకధాటిగా ఏడ్చిన తరుణం
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి…
మొదటసారిగా గీసిన మీసం… మొదట వేసిన ద్రౌపది వేషం
నెల పరీక్షలో వచ్చిన సున్నా… గోడ కుర్చీ వేయించిన నాన్న
పంచుకున్న ఆ పిప్పరమెంటు… పీరు సాయిబు పూసిన సెంటు
చెడుగుడాటలో గెలిచిన కప్పు… షావుకారుకెగవేసిన అప్పు
మొదటి ముద్దులో తెలియని తనము… మొదటి ప్రేమలో తియ్యందనము
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి…
ఎద లోతులో, ఏ మూలనో నిదురించు… జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి.. ..
Gurtukostunnayi Lyrics In Telugu – Naa Autograph – గుర్తుకొస్తున్నాయి లిరిక్స్