Menu Close

Gunna Mamidi Komma Meeda Lyrics In Telugu – Bala Mitrula Katha

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Gunna Mamidi Komma Meeda Lyrics In Telugu – Bala Mitrula Katha

గున్నమామిడి కొమ్మమీద… గూళ్ళు రెండున్నాయి
గున్నమామిడి కొమ్మమీద… గూళ్ళు రెండున్నాయి
ఒక గూటిలోన రామచిలకుంది… ఒక గూటిలోన కోయిలుందీ
గున్నమామిడి కొమ్మమీద… గూళ్ళు రెండున్నాయి…

ఆ ఆ..  చిలకేమో పచ్చనిది… కోయిలేమో నల్లనిది
ఐనా ఒక మనసేదో… ఆ రెంటిని కలిపింది… ||2||

పొద్దున చిలకను చూడందే… ముద్దుగ ముచ్చటలాడందే
పొద్దున చిలకను చూడందే… ముద్దు ముద్దుగ ముచ్చటలాడందే…
చివురులు ముట్టదు… చిన్నారి కోయిల
చిలక ఊగదు… కొమ్మ ఊయలా…ఆ ఆ ఆఆ

హొయ్… గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి
ఒక గూటిలోన రామచిలకుంది… ఒక గూటిలోన కోయిలుందీ
గున్నమామిడి కొమ్మమీద… గూళ్ళు రెండున్నాయి…

ఆ ఆ.. ఒక పలుకే పలుకుతాయి… ఒక జట్టుగ తిరుగుతాయి
ఎండైనా వానైనా… ఏకంగా ఎగురుతాయి… ||2||

రంగూ రూపు వేరైనా… జాతి రీతి ఏదైనా
రంగూ రూపు వేరైనా… తమ జాతి రీతి ఏదైనా
చిలకా కోయిల చేసిన చెలిమి… ముందు తరాలకు తరగని కలిమి… ఈ ఈఈ

హొయ్… గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి
ఒక గూటిలోన రామచిలకుంది… ఒక గూటిలోన కోయిలుందీ
గున్నమామిడి కొమ్మమీద… గూళ్ళు రెండున్నాయి…

గున్నమామిడి కొమ్మమీద… గూళ్ళు రెండున్నాయి… ఆ ఆ ఆ

Like and Share
+1
0
+1
1
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading