Menu Close

ఎంత గొప్ప సంస్కృతి మనది..!


దశరథ మహారాజు తన నలుగురు కొడుకులతో కూడిన వివాహ శోభాయాత్రతో కలసి.. సకుటుంబ సపరివారంగా, బంధు మిత్రుల సమేతంగా బయలుదేరి జనక మహారాజుగారి ద్వారం వద్దకు వెళ్తాడు. అప్పుడు జనక మహారాజు తాను స్వయంగా ఎదురు వెళ్లి సాంప్రదాయ పద్ధతిలో వారి వివాహ శోభాయాత్రకు సాదరపూర్వక స్వాగతం చెబుతాడు.

Special Offer: కరెంట్ పోయినప్పుడు దాదాపు 4 గంటలు ఆన్లో వుండే బల్బ్ - Buy Now

అప్పుడు వెంటనే దశరథ మహారాజు ముందుకు వెళ్లి జనక మహారాజుకు పాదాభివందనం చేస్తాడు. అప్పుడు జనక మహారాజు దశరథ మహారాజు యొక్క భుజం తట్టి పైకి లేపి సంతోషంతో కౌగలించుకొని… “రాజా! మీరు పెద్దవారు. పైగా వరుని పక్షంవారు. ఇలా మీరు నాకు పాదాభివందనం చేయడం ఏమిటి?” గంగానది వెనక్కు ప్రవహించడం లేదు కదా అని అంటాడు.

అప్పుడు దశరథ మహారాజు అద్భుతమైన, సుందరమైన జవాబు చెబుతాడు…

”మహారాజా! మీరు దాతలు… కన్యాదానం చేస్తున్నారు…
నేనైతే యాచకుణ్ణి… మీ ద్వారా కన్యను పొందాలని వచ్చాను…
ఇప్పుడు చెప్పండి. దాత మరియు యాచకులలో ఎవరు పెద్ద? ఎవరు గొప్ప?” అని అంటాడు.

sita ram

ఆ మాటలను విన్న జనక మహారాజు కళ్ళల్లోంచి ఆనందబాష్పాలు రాలుస్తూ ఇలా అంటాడు…
”ఏ గృహంలో అయితే కూతుళ్లు ఉంటారో… వాళ్ళు భాగ్యవంతులు. ప్రతీ కూతురి అదృష్టంలో తండ్రి తప్పక ఉంటాడు.”

ఇదీ ఘనమైన మన భారతీయత..! ఇదీ మహోత్కృష్ఠమైన మన సంస్కృతి..! ఇదీ రామాయణం నీతి..!

Like and Share
+1
0
+1
0
+1
0
Posted in Hinduism

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading