Menu Close

Godari Revulona Song Lyrics In Telugu – Rukmini

Godari Revulona Song Lyrics In Telugu – Rukmini

రయ్యె రయ్యె రయ్ రో
తానే నానే తానేనాన నాననానే తననాన
తననన నననన నననా
తననన నననన ననెనా

గోదారి రేవులోన… రాదారి నావలోన
నా మాట చెప్పుకుంటు ఉంటారంటా
నా నోట చెప్పుకుంటె… బాగోదొ ఏమో కాని
నాలాంటి అందగత్తె నేనేనంట

కూసంత నవ్వగానే… పున్నాగ పువ్వులాగ
పున్నాలు పూయునంట కన్నుల్లో
కాసింత కోపమొస్తే… ఊరంత ఉప్పెనొచ్చి
ఎందుకో ఏమిటో… చెప్పమంటు సందడంట

గోదారి రేవులోన రాదారి నావలోన
నా మాట చెప్పుకుంటు ఉంటారంటా
నా నోట చెప్పుకుంటె… బాగోదొ ఏమో కాని
నాలాంటి అందగత్తె నేనేనంట

పాట అంటె నాదెగాని… కోయిలమ్మదా, ఉట్టి కారుకూతలే
ఆట అంటె నాదెగాని… లేడిపిల్లదా,  పిచ్చి కుప్పిగంతులే
పొలాల వెంట చెంగుమంటు సాగుతూ… పదాలు పాడితే
జిగేలుమంటు కళ్ళు చెదిరి… ఆగవా జులాయి గాలులే
ఏ చిన్న మచ్చలేని… నా వన్నె చిన్నె చూసి
చంద్రుడే సిగ్గుతో… మబ్బు చాటు చేరుకోడా

Winter Needs - Hoodies - Buy Now

గోదారి రేవులోన రాదారి నావలోన
నా మాట చెప్పుకుంటు… ఓ హో హో
నా నోట చెప్పుకుంటె… బాగోదొ ఏమో కాని
నాలాంటి అందగత్తె… ఓ హో హో

నాకు పెళ్ళి ఈడు వచ్చి
పెద్దవాళ్ళకీ ఎంత చిక్కు తెచ్చెనే
రాకుమారిలాంటి నాకు జోడు
వెతకడం వాళ్ళకెంత కష్టమే

ఫలాని దాని మొగుడు గొప్పవాడనీ… అనాలి అందరూ
అలాని నాకు ఎదురు చెప్పకూడదే మహానుభావుడూ
నాకు తగ్గ చక్కనోడు… నేను మెచ్చు ఆ మగాడు
ఇప్పుడే ఎక్కడో తపస్సు చేస్తు ఉంటాడు

గోదారి రేవులోన రాదారి నావలోన
నా మాట చెప్పుకుంటు ఉంటారంటా
నా నోట చెప్పుకుంటె… బాగోదొ ఏమో కాని
నాలాంటి అందగత్తె నేనేనంట

కూసంత నవ్వగానే… పున్నాగ పువ్వులాగ
పున్నాలు పూయునంట కన్నుల్లో
కాసింత కోపమొస్తే… ఊరంత ఉప్పెనొచ్చి
ఎందుకో ఏమిటో… చెప్పమంటు సందడంట

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
బిగ్గ్ బాస్ 8 తెలుగులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ?

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading