ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Gifted Taj Mahal Like Home For his Wife
ప్రేమకు చిహ్నం తాజ్‌మహల్… అందుకే ప్రేమికులు తమ ప్రేమను తెలిపేందుకు తాజ్‌మహల్ బొమ్మలను బహుమానంగా ఇస్తుంటారు.
ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ తాజ్ మహల్ ప్రేయసి కోసం ప్రియుడు కట్టించినది కాదు… భార్యమీద తనకున్న అమితమైన ప్రేమను చాటేందుకు షాజహాన్ ఆనాడు తాజ్‌మహల్‌ను కట్టించాడు.
ఆ తర్వాత ఎవరూ తమ భార్యలపై ఎంత ప్రేమ ఉన్నా ఇంత సాహసానికి పూనుకోలేదు. కానీ తాజాగా ఓ వ్యక్తి తన భార్య మీద ప్రేమతో మరో తాజ్‌మహల్‌ను కట్టించి భార్యకు బహుమతిగా ఇచ్చాడు. ఇప్పడు ఈ తాజ్‌మహల్ ఇల్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్‌కు చెందిన ఆనంద్ చోక్సీ అనే వ్యక్తి తన భార్యకు తాజ్‌మహల్ లాంటి ఇంటిని నిర్మించి బహుమతిగా ఇవ్వాలనుకున్నాడు. అయితే షాజహాన్ భార్య ముంతాజ్ బుర్హాన్‌పూర్‌లోనే మరణించారు. దాంతో షాజహాన్ మొదట తాజ్‌మహల్‌ను ఇక్కడే నిర్మించాలనుకున్నారట. కానీ తర్వాత ఆగ్రాలో నిర్మించారు. అదే గ్రామానికి చెందిన ఆనంద్ చోక్సీ ఈ విషయంపై ఆలోచించాడు..
షాజహాన్ మిస్ అయింది తాను చెయ్యాలనుకున్నాడు. వెంటనే ఇంజినీర్‌ను కలిసి, ఇంటి నిర్మాణం చేపట్టారు. ఈ ఇల్లు నిర్మాణం పూర్తి కావడానికి మూడేళ్లు పట్టిందట. ఈ ఇంటి నిర్మాణంలో పలు సవాళ్లను ఎదర్కొన్నానని ఇంజినీర్ చెప్పారు. ఇంటి లోపలి ఆకృతులను తీర్చిదిద్దేందుకు బెంగాల్, ఇండోర్ నుంచి కళాకారులను పిలిపించారట.
అచ్చం తాజ్‌మహల్‌ను పోలిన టవర్లు ఏర్పాటు చేశామని, రాజస్థాన్ నుంచి తెప్పించిన ‘మక్రానా’తో ఫ్లోరింగ్ చేయించామని వివరించారు. అంతేకాదు, తాజ్‌మహల్ లానే చీకటిలోనూ ఈ ఇల్లు వెలుగులు విరజిమ్ముతుండడం మరో విశేషం. అందంగా, అద్భుతంగా నిర్మించిన ఈ తాజ్‌మహల్ ఇంటిని తన భార్యకు కానుకగా ఇవ్వడంతో ఆమె ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. ఇప్పుడీ తాజ్‌మహల్ ఇల్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.