ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
బిగ్‌బాస్ హౌస్‌లో గంగవ్వ చేసిన ఘోస్ట్ ప్రాంక్ దెబ్బకి కంటెస్టెంట్లు బిత్తరపోయారు. అసలు గంగవ్వ అయితే యాక్టింగ్ ఇరగదీసింది. అయితే ఇది పక్కాగా ప్రాంక్‌యే అని ఒకే ఒక్క కంటెస్టెంట్ కనిపెట్టాడు. గంగవ్వ చేసిన హడావిడి ఎలా ఉంది?
బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్లను మొత్తానికి భయపెట్టింది గంగవ్వ. కామెడీ మాట పక్కన పెడితే ఓ హార్రర్ సినిమా అయితే చూపించింది. ముందుగా కెమెరాతో తాము ఒక ఘోస్ట్ ప్రాంక్.. చేయాలనుకుంటున్నాం.. ఈ విషయం గంగవ్వ, నాకు, అవినాష్‌కి మాత్రమే తెలుసు అంటూ టేస్టీ తేజ చెప్పాడు.
తర్వాత అటు అవినాష్, ఇటు తేజ ఇద్దరూ గంగవ్వకి ప్రాంక్ గురించి చెప్పి.. ఇలా యాక్ట్ చెయ్ అలా చెయ్ అంటూ సలహాలు ఇచ్చారు. ఇంకేముంది గంగవ్వ రెచ్చిపోయింది. అర్ధరాత్రి అందరూ మంచి నిద్రలో ఉండగా నెమ్మదిగా నడిచొచ్చి యాక్టివిటీ ఏరియాలో జుట్టు విరబూసుకొని కూర్చుంది.
తర్వాత ఏదో దెయ్యం పట్టినట్లు అరవడంతో ఒక్కో కంటెస్టెంట్ ఏమైందిరా అంటూ లేచారు. అవినాష్, తేజ అయితే తమ జబర్దస్త్ యాక్టింగ్ అంతా చూపించారు. గంగవ్వ దెబ్బకి రోహిణి బెంబేలు.
గంగవ్వ అలా చేయకగానే రోహిణి దగ్గరికెళ్లి అవ్వా ఏమైంది అంటూ హగ్గు ఇవ్వబోయింది. దీంతో ఒకసారి చేయి జాడించింది గంగవ్వ. దీంతో రోహిణి దెబ్బకి మళ్లీ దగ్గరికి రాలేదు. తర్వాత ఇలానే కాసేపు గంగవ్వ అరుపులు కంటిన్యూ చేసింది.
అందరూ దూరంగా అలా నిల్చొనే ఉండిపోయారు. తర్వాత తేజ-అవినాష్ ఇద్దరూ గంగవ్వను బెడ్ మీదకి తీసుకెళ్లి పడుకోబెట్టేశారు. ఇక ఇదంతా చూసి కంటెస్టెంట్లు ఒక్కొక్కరు ఒకో స్టోరీ మొదలెట్టేశారు. సైకలాజికల్‌గా ఏదో డిస్ట్రబ్ అయింది.. కళ్లల్లో కనిపిస్తుంది.. అంటూ గౌతమ్ చెప్పాడు.
ముఖ్యంగా లేడీ కంటెస్టెంట్లు అయితే చాలా భయపడ్డారు. ఎలా పడుకోవాలబ్బా నాకు కాళ్లు చేతులు వణుకుతున్నాయి.. అంటూ హరితేజ అంది. నాకు కూడా.. నాకు ఒకలా అయిపోయింది.. గంగవ్వ కళ్లు కూడా తెరవలేదు.. నిద్రలోనే స్లీప్ వాకింగా అది.. అంటూ రోహిణి అంది.
మరి డోర్ తీసుకొని.. అలా చేసింది.. సీక్రెట్ టాస్క్ అనుకున్నా.. ఫస్ట్ అంటూ హరితేజ చెప్పింది. కావాలని చేసినా అంత పెర్ఫామెన్స్ రాదు.. తెలీకుండానే చేసింది.. అంటూ రోహిణి చెప్పుకొచ్చింది. ఇక అందరూ భయపడిన విధానం చూసి అవినాష్-తేజకి వణుకుపుట్టింది. అన్నా ఇది ప్రాంక్ అని తెలిసిన తర్వాత మన ఇద్దరికీ నామినేనషన్స్ ఫిక్స్.. అందరూ వణికిపోయారు.. అంటూ తేజ అన్నాడు.
ఇక ఉదయం లేచాకా కూడా గంగవ్వ టాపిక్‌యే మాట్లాడుకున్నారు కంటెస్టెంట్లు. నిఖిల్‌కి ఈ విషయం చెప్పగానే నిజమా ప్రాంకా అంటూ అడిగాడు. ఆ వయసులో అర్ధరాత్రి ప్రాంక్ ఏంటిరా.. అంటూ ప్రేరణ అంది.
మరోవైపు పృథ్వీకి చెబుతూ గంగవ్వకి అంత పవర్ అంత ఎనర్జీ ఉందని నాకు తెలీదు.. అంటూ గొప్పగా చెప్పింది హరితేజ. దీంతో గంగవ్వ మైక్ తీసుకునే పడుకుంటుంది రోజు.. కానీ మైక్ వేసుకుందని అంటున్నారు కదా.. ఖచ్చితంగా అది ప్రాంకే.. లేకపోతే మైక్ వేసుకొని ఎందుకు చేస్తుంది.. ముగ్గురు ఎవరో ప్లాన్ చేసి ఉంటారు.. అంటూ పృథ్వీ భలే పట్టేశాడు.