Menu Close

Gagananiki Lyrics In Telugu – Tholi Prema

Gagananiki Lyrics In Telugu

గగనానికి ఉదయం ఒకటే
కెరటాలకి సంద్రం ఒకటే
జగమంతట ప్రణయం ఒకటే, ఒకటే
ప్రణయానికి నిలయం మనమై
యుగయుగముల పయనం మనమై
ప్రతి జన్మలో కలిశాం మనమే, మనమే

జన్మించలేదా… నీవు నా కోసమే
గుర్తించలేదా… నన్ను నా ప్రాణమే
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ

గగనానికి ఉదయం ఒకటే
కెరటాలకి సంద్రం ఒకటే
జగమంతట ప్రణయం ఒకటే, ఒకటే

నీ కన్నుల్లో కలను అడుగు… ఇతడు ఎవరనీ
నీ గుండెల్లో తిరిగే లయనే… బదులు పలకనీ
నిదురించు యవ్వనంలో పొద్దుపొడుపై
కదిలించలేదా నేనే మేలుకొలుపై
గతజన్మ జ్ఞాపకాన్నై… నిన్ను పిలువా
పరదాల మంచుపొరలో ఉండగలనా

గగనానికి ఉదయం ఒకటే
కెరటాలకి సంద్రం ఒకటే
జగమంతట ప్రణయం ఒకటే, ఒకటే

నా ఊహల్లో కదిలే కడలే ఎదుటపడినవీ
నా ఊపిరిలో ఎగసే సెగలే కుదుటపడినవీ
సమయాన్ని శాశ్వతంగా నిలిచిపోనీ
మమతన్న అమృతంలో మునిగిపోనీ
మనవైన ఈ క్షణాలే అక్షరాలై
మృతి లేని ప్రేమ కథగా మిగిలిపోనీ

గగనానికి ఉదయం ఒకటే
కెరటాలకి సంద్రం ఒకటే
జగమంతట ప్రణయం ఒకటే, ఒకటే
ప్రణయానికి నిలయం మనమై
యుగయుగముల పయనం మనమై
ప్రతి జన్మలో కలిశాం మనమే, మనమే

జన్మించలేదా… నీవు నా కోసమే
గుర్తించలేదా… నన్ను నా ప్రాణమే
ప్రేమ ప్రేమ ప్రేమ
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమా

Gagananiki Lyrics In English

Gagananiki Udayam Okate
Keratalaki Sandram Okate
Jagamanthata Pranayam Okate, Okate
Pranayaaniki Nilayam Manamai
Yugayugamula Payanam Manamai
Prathi Janmalo Kalisham Maname, Maname

Janminchaledhaa Neevu Naa Kosame
Gurthinchaledhaa… Nannu Na Praaname
Prema Prema Prema Prema

Gagananiki Udayam Okate
Keratalaki Sandram Okate
Jagamanthata Pranayam Okate, Okate

Nee Kannullo Kalanu Adugu
Ithadu Evarani
Nee Gundello Thirige Layane
Badhulu Palakani
Nidhurinchu Yavvanamlo Poddhupodupai
Kadhilinchaledhaa Nene Melukolupai
Gatha Janma Gnapakaannai Ninnu Piluvaa
Paradaala Manchu Poralo Undagalanaa

Gagananiki Udayam Okate
Keratalaki Sandram Okate
Jagamanthata Pranayam Okate, Okate

Naa Oohallo Kadhile Kadale Edhutapadinavi
Naa Oopirilo Egase Segale Kudhutapadinavi
Samayaanni Shaashwathangaa Nilichiponi
Mamathanna Amruthamlo Munigiponi
Manavaina Ee Kshanaale Aksharaalai
Mruthileni Prema Kathagaa Migiliponi

Gagananiki Udayam Okate
Keratalaki Sandram Okate
Jagamanthata Pranayam Okate, Okate
Pranayaaniki Nilayam Manamai
Yugayugamula Payanam Manamai
Prathi Janmalo Kalisham Maname, Maname

Janminchaledhaa Neevu Naa Kosame
Gurthinchaledhaa… Nannu Na Praaname
Prema Prema Prema Prema
Prema Prema Premaa

Like and Share
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading