అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి

అల్లం తీసుకుంటే అనేక సమస్యలు తగ్గుతాయి. కానీ ఈ కాలంలో అల్లం తీసుకుంటే, అది మీ ఛాతీలో చికాకు, కడుపులో గ్యాస్-ఎసిడిటీ సమస్యను కలిగిస్తుంది.
బీట్‌రూట్‌లో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. వీటిలో ఉండే ఆక్సలేట్ అనే మూలకం కారణంగా ఈ కాలంలో ఎక్కువగా తింటే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. ఇప్పటికే కిడ్నీ స్టోన్ సమస్యతో బాధపడుతున్న వ్యక్తులు. వారు బీట్‌రూట్‌ను అస్సలు తినకూడదు.
పాలకూర ఐరన్ విటమిన్ ఎక్కువగా ఉంటుంది. ఈ కాలంలో దీన్ని ఎక్కువగా తీసుకుంటే అందులో ఉండే హిస్టమిన్ అనే పదార్థం వల్ల చాలా మందికి అలర్జీ సమస్యలు తలెత్తుతాయి. అంతే కాకుండా కిడ్నీలో రాళ్ల సమస్యలతో బాధపడేవారు పాలకూర తినకూడదు.
వెల్లుల్లిని రుచి కోసం అన్ని ఆహార పదార్ధాల్లో వినియోగిస్తుంటారు. అనేక లక్షణాలతో కూడిన వెల్లుల్లిని తీసుకోవడం తేమతో కూడిన వర్షాకాలంలో ఆరోగ్యానికి హానికరం. మలబద్ధకం, అసిడిటీ, కడుపు ఉబ్బరం, గ్యాస్ కారణంగా కడుపునొప్పి వంటి సమస్యలు ఉన్నవారు ఈ కాలంలో వెల్లుల్లిని తినకూడదని నిపుణులు చెబుతున్నారు.
వర్షాకాలంలో కంద దుంపను తినకపోవడం చాలా మంచింది. ఎందుకంటే దీన్ని తినడం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. వేసవికాలంలో బాడీ హీట్ పెరిగి.. దాని కారణంగా జీర్ణక్రియ సమస్యతో పాటుగా ఫైల్స్ వంటి సమస్యలు వర్షాకాలంలో తలెత్తుత్తాయి. దీన్ని తీసుకుంటే ఆ సమస్య మరింత ఎక్కువ అవుతుంది.
అంతే కాకుండా చల్లని పదార్ధాలకు ఎంత దూరంగా వుంటే అంతా మంచిది. ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ వంటివి కుదిరితే అస్సలు తీసుకోకండా వుండటానికి ప్రయత్నించండి.
వర్షా కాలంలో ఇవి తిని ఆరోగ్యం పాడు చేసుకోకండి – Food to Avoid in Rainy Season