అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
Father and Son Emotional Story in Telugu
కొడుకు తన భార్య కోరిక మేరకు, తన తండ్రిని వృద్ధాశ్రమంలో చేర్పించడానికి కారులో తీసుకు వస్తాడు. పక్కనే వృద్ధాశ్రమంతో పాటు, అనాథాశ్రమం కూడా ఉంటుంది.
కారులో నుండి తన తండ్రికి కావాల్సిన సామానులు ఒకొక్కటిగా బయటకి తీస్తున్నారు కొడుకు, కోడలు. ఆ టైములో వృద్ధాశ్రమం నిర్వాహకుడు తండ్రితో చనువుగా మాట్లాడటం కొడుకు గమనించాడు.

తండ్రితో చివరిగా మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోను, పండగల్లో కూడా ఇంటికి రావద్దని చెప్పి బయలు దేరబోతూ వృద్ధాశ్రమం నిర్వాహకుడితో “ఇందాక మా నాన్నతో చాలా చనువుగా మాట్లాడుతున్నారు, మా నాన్న మీకు ఇంతకు ముందే తెలుసా అని అడుగుతాడు.”
దానికి ఆ నిర్వాహకుడు “అవును.. బాగా తెలుసు. 30 ఏళ్ల క్రితం మా అనాథ శరణాలయం నుంచే మీ నాన్నగారు ఒక అనాథబాలుడిని దత్తత తీసుకున్నారు” అని నిర్వాహకుడు చెపుతాడు.