Menu Close

న్యూ టూరిస్ట్ ప్లేస్ హైదరాబాద్ లో – Experium Eco Park Tour – Hyderabad – New Tourist Place – 2025

అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి

న్యూ టూరిస్ట్ ప్లేస్ హైదరాబాద్ లో – Experium Eco Park Tour – Hyderabad – New Tourist Place – 2025

హైదరాబాద్ పర్యాటక ఆకర్షణలో మరో సుందరమైన ప్రదేశం చేరింది. రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ దేవస్థానం మార్గంలోని ప్రొద్దుటూరు గ్రామంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఏకో ఫ్రెండ్లీ ఎక్స్‌పీరియం పార్క్‌ను ఏర్పాటుచేశారు. ఈ పార్క్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.

ప్రకృతి ప్రేమికులు తప్పక సందర్శించాల్సిన ప్రదేశం ఎక్స్ పీరియం పార్క్. 150 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఎకో రిక్రియేషనల్ పార్క్ ఇది. ఇందులో ప్రకృతి, కళ, పురాణాలను మిళితం చేశారు.

సజీవ శిల్పాలతో ఎంతో సృజనాత్మకతతో ఎక్స్ పీరియం పార్క్ ను ఏర్పాటుచేశారు. జపనీస్ తోటలు, 3,000 ఏళ్ల నాటి చెట్లు, పూల మండలాలు, అడ్వెంచర్ మార్గాలు, లగ్జరీ స్టేలను ఆస్వాదించవచ్చు. ఈ పార్కులో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 15 వేల జాతుల మొక్కలను ఉంచారు. 1500 మంది కూర్చునేలా యాంఫీ థియేటర్​ను నిర్మించారు.

Experium Eco Park Tour Hyderabad in Telugu

రాందేవ్​రావు ఆరున్నరేళ్లుగా పాటు శ్రమించి ఎక్స్ పీరియం పార్క్​ను తీర్చిదిద్దారు. ఇందులో రూ.లక్ష నుంచి రూ.3.5 కోట్ల విలువ చేసే అరుదైన వృక్షాలు ఉన్నాయి.

  • ఈ ఎకో పార్కులో 25,000 రకాలు మొక్కలు ఉన్నాయి. వీటిని 85 దేశాల నుంచి సేకరించారు. వీటి ధర రూ.1 లక్ష్ నుంచి రూ.3.5 కోట్ల వరకు ఉంటుంది.
  • ప్రకృతి ప్రేమికులు, పర్యావరణ వేత్తలకు ఇది ఒక అద్భుతమైన ప్రదేశం.
  • ఇక్కడ భారత దేశంలోనే అతి పెద్ద యాంపిథియేటర్ ఉంది. ఇందులో 1,500 మంది సందర్శకులు ఒకేసారి కూర్చోవచ్చు. భారత వారసత్వ సంపద, కీర్తిని చాటేలా కార్యక్రమాలు ఉంటాయి ఇక్కడ – India’s Biggest Amphitheatre in Hyderabad
  • ఇక్క భారత దేశంలోనే తొలి ఫోర్ డైరక్షన్ జిప్‌లైన్ ఉంది. దీని విస్తీర్ణం ఒక కిమీ. దీంతో పాటు ఇక్కడ అది పెద్ద స్నో పార్కు కూడా ఇక్కడే ఉంది – Best Zipline Activity in Hyderabad
Experium Eco Park Tour Hyderabad in Telugu
  • ఇక్కడ ప్రపంచంలోనే తొలి ట్రీ కాఫీ షాపు ఉంది – World’s first tree coffee shop in Hyderabad
  • ఇక్కడ అండర్ వాటర్ రెస్టారెంట్ ఉంది – Under water restaurant in Hyderabad
  • ఇక్కడ 20 వరకు స్టెయిన్‌లెస్ స్టీల్ శిల్పాలను ఏర్పాటు చేశారు. వీటి ఎత్తు 30 అడుగులు ఉంటుంది.
  • 12 ఎకరాల మేరా మ్యాన్ మేడ్ బీచ్ ఉంటుంది. ఇక్కడ మీరు రిలాక్స్ అవ్వొచ్చు, ఫోటోగ్రఫీ చేయవచ్చు – Man Made Beach Near Hyderabad
  • ఇక్కడ అతి పెద్ద బాక్స్ క్రికెట్ ఫెసిలిటీ ఉంది – Best Box Cricket Near Hyderabad
  • ఇక్కడ 40 రూములు, 20 లగ్జరీ కాటేజీలు ఉన్నాయి. హైదరాబాద్‌కు సమీపంలో మంచి హనీమూన్ స్పాట్ అవుతుంది – Best Honeymoon Spot Near Hyderabad
Experium Eco Park Tour Hyderabad in Telugu
  • ఇక్కడ 600 సెల్ఫీ పాయింట్స్ ఉన్నాయి – Best Photoshoot Spot Near Hyderabad
  • ఇక్కడ పైకస్ జాతికి చెందిన 5,000 ఏళ్లనాటి చెట్టును చూడవచ్చు.
  • ఎక్స్‌పీరియం ఎకో పార్కులో ప్రపంచ స్థాయి రుచులను మిచెలిన్ గ్రాండ్ డైనింగ్‌లో ఎంజాయ్ చేయవచ్చు – Best Michelin-Grade Dining
  • ఈ పార్కు నిర్మాణం కోసం ఏకంగా రూ.150 కోట్లు ఖర్చు చేశారు.
  • ఇందులో మొత్తం 1,000 వరకు ఉద్యోగులు పని చేస్తున్నారు.
Experium Eco Park Tour Hyderabad in Telugu

టికెట్ ధర: ఎక్స్ పీరియం ఎకో పార్కు ఎంట్రీ టికెట్ ధర రూ.1,600 ఉంటుంది.
Ticket Price of Experium Eco Park is 1600 Rs.
టైమింగ్ : ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు
Timings of Experium Eco Park Hyderabad are from 10 AM to 6 PM.

Experium Eco Park Tour Hyderabad in Telugu

Overview of Experium Eco Park
Key Attractions About Experium Eco Park
Experium Eco Park Entry Fee and Timings
How To Get Experium Eco Park Tickets
How To Reach Experium Eco Park

Like and Share
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading