Menu Close

Evaru Lerani Anaku Song Lyrics In Telugu


ఎవరూ లేరని అనకు… తోడుంటా నీ కడ వరకూ
చీకటిలోన వెలుగవుతా నీ కొరకు
ఎపుడు ఒంటరి అనకు.. నీ తోనే చావూ బ్రతుకు
కంటికి రెప్పై ఉంటాలే తుది వరకూ
ప్రేమతోటి చెంప నిమరనా
గుండెచాటు బాధ చెరపనా
నీ ఊపిరే అవ్వనా
గడచిన కాలమేదో గాయపరచినా
జ్ణాపకాలు చేదు మిగిలినా
మైమరపించే హాయి అవ్వనా
ఒట్టేసి నేను చెబుతున్నా
ఒదిలుండలేను క్షణమైనా
నీ సంతోషానికి హామి ఇస్తున్నా
ఎవరూ లేరని అనకు… తోడుంటా నీ కడ వరకూ
చీకటిలోన వెలుగవుతా నీ కొరకు

నా మనసే నీకివ్వనా… నీలోనే సగమవ్వనా
అరచేతిని కలిపే… చెలిమే నేనవనా
ముద్దుల్లో ముంచేయనా… కౌగిలిలో దాచెయ్యనా
నా కన్నా ఇష్టం… నువ్వే అంటున్నా
తడిచొస్తే తల తుడిచే… చీరంచును నేనై మారనా
అలిసొస్తే ఎపుడైనా నా ఒడినే… ఊయల చేస్తానంటున్నా
ఎవరూ లేరని అనకు… తోడుంటా నీ కడ వరకూ
చీకటిలోన వెలుగవుతా నీ కొరకు

నిను పిలిచే పిలుపవ్వనా… నిను వెతికే చూపవ్వనా
నీ కన్నుల వాకిట మెరిసే మెరుపవనా
నిను తలచే తలపవ్వనా… నీ కధలో మలుపవ్వనా
ఏడడుగుల బంధం నీతో అనుకోనా
మనసంతా దిగులైతే… నిను ఎత్తుకు సముదాయించనా
నీ కోసం తపన పడి… నీ అమ్మా నాన్న అన్నీ నేనవనా
ఎవరూ లేరని అనకు… తోడుంటా నే కడ వరకూ
చీకటిలోన వెలుగవుతా నీ కొరకు

Like and Share
+1
0
+1
0
+1
0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading