Menu Close

Evaro Ravali Lyrics in Telugu – Prem Nagar


Evaro Ravali Lyrics in Telugu – Prem Nagar

ఎవరో రావాలి నీ హ్రుదయం కదిలించాలి
నీ తీగలు సవరించాలి నీలో రాగం పలికించాలి //ఎవరో// మూల దాగి _ ధూళి మూగి
మూగవోయిన _ మధుర వీణా
మరిచిపొయిన _ మమత లాగా
మమత లుడిగిన _ మనసులాగా
మాసిపో… తగునా… //ఎవరో//
ఎన్ని పదములు నేర్చినావో ఎన్ని కళలను దాచినావో
కొనగోట మీటిన చాలు _ నీలో
కోటి స్వరములు పలుకును… //ఎవరో//
రాచనగరున వెలసినావు రసపిపాసకు నోచినావు శక్తి మరచి, రక్తవిడిచి మత్తు ఏదొ మరిగినావు
మరిచిపోతగునా… //ఎవరో//

Like and Share
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading