ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Evalu Rammannaru Koduka Lyrics In Telugu – Song On Hyderabad, Charan Arjun, Kanakavva
ఎవలు రమ్మన్నారు కొడుకా…!
మిమ్ముల్ని ఎవరు పొమ్మన్నారు కొడుకా..!
ఎందుకొచ్చినారు బిడ్డా..! ఎందుకు ఇడిసెల్లి పోతున్రు బిడ్డా..!
దునియా మొత్తం రాని నన్నూ… దొరసాని అన్నారు కొడుకా…
దూరదూరం నుండి వచ్చీ… నన్ను మురిసేల చేసిన్రు బిడ్డా…
మీ బతుకుదెరువుకు… మీ సదువు కొలువుకు నగరానికొచ్చారే…
పొట్టసేతపట్టి పట్టణానికొచ్చి… సెట్టంత ఎదిగారే…
కులము తలము లేదు… వేషభాషలు లేవు
అందరినీ మోసిందే… గడప తొక్కినోళ్ల కడుపునిండా పెట్టి…
అమ్మల్లే చూసిందే…
నన్ను భాగ్యనగరమన్న మీరే… అభాగ్యురాలు చేసినారే
ఎన్ని చూశాను నేను గాయాలే… ఇంత వలపోత నాకెప్పుడు రాలే…
కడమీన భాగ్యాన్ని నేను… మట్టిలోనుండి పుట్టుకొచ్చాను
ఓ మారాజు మోగించె నన్ను… భాగ్యనగరంగ ఎలగొల్లినాను…
అన్ని దిక్కుల నుండి మీరు… అన్నమంటు నాకాడికొచ్చినారు…
కన్నతల్లి ఓలె నేను… కడుపులో పెట్టి సూసుకున్నాను…
గుండెల్లో లక్ష్యంతో ఉన్న ఊరు వదిలి… బండెక్కి వచ్చారే
కొండంత అండై… ఎండల్లో, వానల్లో గొడుగల్లె కాసిందే…
మీ ఖాళీ జేబులకు… మీ గాలి మేడలకు రాదారి చూపిందే…
వెదురల్లె కదిలొచ్చి… వేణువుగ ఎదిగేంత వేదికను ఇచ్చిందే…
తల్లి గుణము నాది కొడుకా… నీ మేలు తప్ప కీడు తలువా…
ఎవడు చేసిన పాపపుణ్యం… నేను అయిపోయినాను ఇపుడు కొదవ…
రాష్ట్రాలుగా వేరు అయినా.. ఈడనే ఉన్నారు నన్నొదలలేక…
రాయకీయం, చిత్రసీమ, మీడియా… అందరికీ ఇచ్చాను నీడ…
ఖండఖండాలుగా కోసి… నాతో చేశారు రియల్ దందాలు…
పరదేశ మోజుల్లో మునిగి… పాడు చేశారు పాత మూలాలు…
అక్కర దీరాక పక్కన ఇసిరేసి… ఎక్కడికో పోతే…
పోటీలు పడి నింగి తాకేల గట్టిన మేడలెవరిపాలు…
ఆపదలు ఎదురైతే… ఏ ముందు జాగరత వీలున లేకుండా…
నరికేసుకుంటారె నీడను ఇచ్చేటి… నిలుచున్న వృక్షాలు…
పల్లె ఇడిసి మీరు వత్తే… అప్పుడా తల్లి ఎంత ఏడ్చినాదో…
ఇప్పుడు ఇడిసి పోతానంటే నన్నూ… గుండె సెరువై పోతుంది బిడ్డా…