అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
Enthati Rasikudavo Lyrics In Telugu – Muthyala Muggu
ఎంతటి రసికుడవో తెలిసెరా
నీవెంతటి రసికుడవో, ఓ ఓ తెలిసెరా
నీ వింతలు ఇంతలు ఇంతలై
కవ్వింతలై మరులొలికెరా
ఎంతటి రసికుడవో తెలిసెరా
నీ వింతలు ఇంతలు ఇంతలై
కవ్వింతలై మరులొలికెరా, ఆ ఆ
ఎంతటి రసికుడవో తెలిసెరా
గుత్తపు రవిక ఓయమ్మో
చెమట చిత్తడిలో… తడిసి ఉండగా, ఆ ఆ
గుత్తపు రవిక ఓయమ్మో
చెమట చిత్తడిలో… తడిసి ఉండగా
ఎంతసేపు నీ తుంటరి చూపు
ఎంతసేపు నీ తుంటరి చూపు
ఎంతసేపు నీ తుంటరి చూపు
అంతలోనే తిరుగాడుచుండగా
ఎంతటి రసికుడవో, ఓ ఓ తెలిసెరా
నీ వింతలు ఇంతలు ఇంతలై
కవ్వింతలై మరులొలికెరా, ఆ ఆ
ఎంతటి రసికుడవో తెలిసెరా
మోము మోమున ఆనించి
ఏవో ముద్దు ముచ్చటలాడబోవగా
మోము మోమున ఆనించి
ఏవో ముద్దు ముచ్చటలాడబోవగా, ఆ ఆ
మోము మోమున ఆనించి
ముద్దు ముచ్చటలాడబోవగా
రక్కున కౌగిట చిక్కబట్టి
రక్కున కౌగిట చిక్కబట్టి
నా చెక్కిలి మునిపంట నొక్కుచుండగా, ఆ
ఎంతటి రసికుడవో తెలిసెరా
నీ వింతలు ఇంతలు ఇంతలై
కవ్వింతలై మరులొలికెరా
ఎంతటి రసికుడవో తెలిసెరా
తెలిసెరా తెలిసె రారా