ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Enni Talachina Lyrics In Telugu – Telugu Christian Songs
ఎన్ని తలచినా ఏది అడిగినా… జరిగేది నీ చిత్తమే
ఎన్ని తలచినా ఏది అడిగినా… జరిగేది నీ చిత్తమే, ప్రభువా
నీ వాక్కుకై వేచియుంటిని… నా ప్రార్థన ఆలకించుమా
నీ వాక్కుకై వేచియుంటిని… నా ప్రార్థన ఆలకించుమా, ప్రభువా
నీ తోడు లేక నీ ప్రేమ లేక
ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు ||2||
అడవి పూవులే నీ ప్రేమ పొందగా ||2||
నా ప్రార్థన ఆలకించుమా
నా ప్రార్థన ఆలకించుమా, ప్రభువా ||ఎన్ని తలచినా||
నా ఇంటి దీపం నీవే అని తెలసి
నా హృదయం నీ కొరకై పదిలపరచితి ||2||
ఆరిపోయిన నా వెలుగు దీపము ||2||
వెలిగించుము నీ ప్రేమతో
వెలిగించుము నీ ప్రేమతో, ప్రభువా ||ఎన్ని తలచినా||
ఆపదలు నన్ను వెన్నంటియున్నా
నా కాపరి నీవై నన్నాదుకొంటివి ||2||
లోకమంతయూ నన్ను విడచినా ||2||
నీ నుండి వేరు చెయ్యవు
నీ నుండి వేరు చెయ్యవు, ప్రభువా ||ఎన్ని తలచినా||
నా స్థితి గమనించి నన్నూ ప్రేమించి
నా కొరకై కల్వరిలో యాగమైతివి ||2||
నీదు యాగమే నా మోక్ష మార్గము ||2||
నీయందే నిత్యజీవము
నీయందే నిత్యజీవము, ప్రభువా
ఎన్ని తలచినా ఏది అడిగినా… జరిగేది నీ చిత్తమే
ఎన్ని తలచినా ఏది అడిగినా… జరిగేది నీ చిత్తమే, ప్రభువా
Enni Talachina Lyrics In Telugu – Telugu Christian Songs