అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
Ennenno Janmala Bandham Lyrics In Telugu – Pooja
ఎన్నెన్నో జన్మల బంధం… నీదీ నాదీ
ఎన్నటికీ మాయని మమత… నాదీ నీదీ
ఒక్క క్షణం నిను వీడి నేనుండలేను…
ఒక్క క్షణం నీ విరహం నే తాళలేను…
ఎన్నెన్నో జన్మల బంధం… నీదీ నాదీ
ఎన్నటికీ మాయని మమత… నాదీ నీదీ
పున్నమి వెన్నెలలోన పొంగును కడలీ
నిన్నే చూసిన వేళా… నిండును చెలిమి
ఓహో హో హో… నువ్వు కడలివైతే… నే నదిగా మారి
చిందులు వేసి వేసి నిన్ను… చేరనా చేరనా చేరనా…
ఎన్నెన్నో జన్మల బంధం… నీదీ నాదీ
ఎన్నటికీ మాయని మమత… నాదీ నీదీ
విరిసిన కుసుమము నీవై మురిపించేవు…
తావిని నేనై నిన్ను పెనవేసెను…
ఓహో హో హో… మేఘము నీవై… నెమలిని నేనై
ఆశతో నిన్ను చూసి చూసి… ఆడనా ఆడనా ఆడనా…
ఎన్నెన్నో జన్మల బంధం… నీదీ నాదీ
ఎన్నటికీ మాయని మమత… నాదీ నీదీ
ఆ… ఆ… ఒ… హో… ఆ హా… ఆ ఆ
కోటి జన్మలకైనా కోరేదొకటే…
నాలో సగమై ఎపూడూ… నేనుండాలి
ఓహో హో హో… నీవున్న వేళా… ఆ స్వర్గమేలా
ఈ పొందు ఎల్లవేళలందు ఉండనీ ఉండనీ ఉండనీ…
ఎన్నెన్నో జన్మల బంధం… నీదీ నాదీ
ఎన్నటికీ… ఎన్నటికీ… మాయని మమత… నాదీ నీదీ
ఒక్క క్షణం నిను వీడి నేనుండలేను…
ఆ హా హా హా హా… ఓ హో హో హో…