ఆ ఆఆ ఎన్నాళ్లుగానో చెరగనే లేదు… ఈ ప్రేమ భాషే
తేనెల్లు చిందే ఊహలతోటి… గుండెల్ని ముంచే
ఓ లాలి పాటై వయసుకు… పూల పందిళ్లు వేసే
తొలి తొలి ప్రేమ… జన్మ లెన్నైనా వీడిపోదు
కాలం కాదన్న చెలిమితో… హృదయాన్ని అల్లుకోదా
నింగే చెంత వాలి… మనసున హరివిల్లు గీసి పోదా
ఇసుకలలో, నది మలుపులలో… చిరు గాలుల్లో గాలల్లే
ప్రతి ఎదలో ముడిపడు జతలో… తొలిప్రేమ సంతకమే
పగలైనా నడిరేయైన… తన ఊహేనా ఊహేన
నవ్వులకు మరి వేధనకు… చెబుతుంది స్వాగతమే
ఓ కోపంగా కొంచం మౌనంగా… నువ్వున్నా
పొంగే కన్నీరు ఆగేనా… కాస్తైనా కునుకు తీసేనా
ఎన్నాళ్లుగానో (గానో) చెరగనే లేదు… ఈ ప్రేమ భాషే
తేనెల్లు చిందే (చిందే) ఊహలతోటి… గుండెల్ని ముంచే
ఓ లాలి పాటై (పాటై) వయసుకు… పూల పందిళ్లు వేసే
తొలి తొలి ప్రేమ… జన్మ లెన్నైనా వీడిపోదు
చిరు కలహం ఇది ఒక విరహం… ఏ సంతోషం సరికాదే
ఈ ప్రణయం ఓ తొలి జననం… విడిపోనిదీ వరమే
మెరుగులకు పైమెరుపులకు… వశమయ్యేనా కొంతైనా
ఇరువురిలో ఓ ఊపిరిగా… కొలువైన పసి గుణమే
లోకంలో వేచే ఏకాంత హృదయాలు… జంటై ప్రేమించు దారుల్లో
పూదోటై భూమి పూస్తుందే…
ఎన్నాళ్లుగానో చెరగనే లేదు… ఈ ప్రేమ భాషే
తేనెల్లు చిందే ఊహలతోటి… గుండెల్ని ముంచే
ఓ లాలి పాటై వయసుకు… పూల పందిళ్లు వేసే
తొలి తొలి ప్రేమ… జన్మ లెన్నైనా వీడిపోదు
కాలం కాదన్న చెలిమితో… హృదయాన్ని అల్లుకోదా
నింగే చెంత వాలి… మనసున హరివిల్లు గీసి పోదా
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.