ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Ennallo Vechina Udayam Lyrics In Telugu – Manchi Mitrulu
పల్లవి
ఎన్నాళ్ళో వేచిన ఉదయం… ఈనాడే ఎదురౌతుంటే
ఎన్నాళ్ళో వేచిన ఉదయం… ఈనాడే ఎదురౌతుంటే
ఇన్ని నాళ్ళు దాచిన హృదయం… ఎగిసి ఎగిసి పోతుంటే
ఇంకా తెలవారదేమి… ఈ చీకటి విడిపోదేమి
ఇంకా తెలవారదేమి… ఈ చీకటి విడిపోదేమి
చరణం – 1
మంచిని పెంచిన మనిషిని… ఏ వంచన ఏమీ చేయదని
మంచిని పెంచిన మనిషిని… ఏ వంచన ఏమీ చేయదని
నీతికి నిలబడు వానికి… ఏ నాటికి ఓటమి లేదనీ
నీతికి నిలబడు వానికి… ఏ నాటికి ఓటమి లేదని
నే చదివిన జీవిత పాఠం… నీకే నేర్పాలని వస్తే
ఇంకా తెలవారదేమి… ఈ చీకటి విడిపోదేమి
ఇంకా తెలవారదేమి… ఈ చీకటి విడిపోదేమి
చరణం – 2
నాగులు తిరిగే కోనలో… ఏ న్యాయం పనికిరాదని
నాగులు తిరిగే కోనలో… ఏ న్యాయం పనికిరాదని
కత్తిని విసిరేవానిని… ఆ కత్తితోనె గెలవాలని
నేనెరిగిన చేదు నిజం… నీతో చెప్పాలని వస్తే
ఇంకా తెలవారదేమి… ఈ చీకటి విడిపోదేమి
ఇంకా తెలవారదేమి… ఈ చీకటి విడిపోదేమి
ఎన్నాళ్ళో వేచిన ఉదయం… ఈనాడే ఎదురౌతుంటే
ఎన్నాళ్ళో వేచిన ఉదయం… ఈనాడే ఎదురౌతుంటే
ఇన్ని నాళ్ళు దాచిన హృదయం… ఎగసి ఎగసి పోతుంటే
ఇంకా తెలవారదేమి… ఈ చీకటి విడిపోదేమి
ఇంకా తెలవారదేమి… ఈ చీకటి విడిపోదేమి