Menu Close

Emi Bathuku Emi Bathuku Song Lyrics In Telugu – 1997


Emi Bathuku Emi Bathuku Song Lyrics In Telugu – 1997

ఊరి బయట గుడిసెలల్లా ఉండేటోల్లం
దేవుణ్ణే కాదు గుడి మెట్లను కూడా తాకనోల్లం
తిండిలేని చదువులేని పేదవాళ్లం
దేశమేమో పవిత్రమాయె… మా బతుకులేమో అపవిత్రమాయె
మీరు చెప్పే వేదమంతా… మా బతుకునంతా పాడు చేసే

ఏమి బతుకూ, ఏమి బతుకూ
చెడ్డ బతుకు, చెడ్డ బతుకు… చెడ్డ బతుకు

ఒక్కపూట మెతుకు కోసం మేము సారూ
పగలు రాత్రి పనులు చేసి అలసిపోతాం
పనికి అడ్డు అవుతారని పసిపిల్లగాల్ల
గింత కళ్ళు పోసి మత్తులోనే పండబెడ్తమ్
ఏండ్లకేండ్లు గడిసిపోయినా… మారని మా తలరాతలాయే

ఏమి జేత్తం, ఏమి జేత్తం… ఏమి జేత్తం
ఏమి జేత్తం, ఏమి జేత్తం… ఏమి జేత్తం

ఇంటిదాన్ని ఈడొచ్చిన మా ఆడపిల్లను
గద్దలాగా ఎత్కపోయి కామమంతా తీర్చుకొని
వెన్నుపూస ఇరగగొట్టి, నాలుక కోసి, పెట్రోల్ పోసి
తగలబెడితే తగలబెడితే… తగలబెడితే తగలబెడితే

తిరిగిరాని ఆడబిడ్డను తలుసుకొని
వెక్కి వెక్కి వెక్కి వెక్కి మేము ఏడుస్తుంటె
ఎవ్వరికేమి చెప్పుకోము… ఎవ్వరు మమ్ముల ఆదుకోరు
ఏమి జేత్తం ఏమి జేత్తం ఏమి జేత్తం
ఏమి జేత్తం ఏమి జేత్తం ఏమి జేత్తం

గద్దలాగా మా ఆడపిల్లను ఎత్కపోయినోడు
పెట్రోల్ పోసి సజీవదహనం చేయకుండా
చంపకుండా ఇడ్సిపెడితే… అయ్యా సారూ
మా ఆడబిడ్డ మా కళ్ళ ముందే ఉండే సారూ
మా బతుకులేదో… మాకు మేమే బతికేటోళ్ళం
మా బతుకులేదో… మాకు మేమే బతికేటోళ్ళం

Like and Share
+1
1
+1
0
+1
0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading