Menu Close

Emantivi Emantivi Dialogue Lyrics In Telugu – Daana Veera Soora Karna


Emantivi Emantivi Dialogue Lyrics In Telugu – Daana Veera Soora Karna

ఆచార్య దేవా..! హ హ హ హ
ఏమంటివి ఏమంటివి..!
జాతి నేపమున సూత సుతులకిందు నిలువర్హత లేదందువా…?
హ్హ..! ఎంత మాట ఎంత మాట..!

ఇది క్షాత్ర పరీక్ష గాని క్షత్రీయ పరీక్ష కాదే…
కాదు కాకూడదు… ఇది కుల పరీక్షయే అందువా…!
నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది…?
అతి జుగుప్సాకరమైన నీ సంభవమెట్టిది…
మట్టి కుండలో పుట్టితివి కదా..! హహహ
నీది ఏ కులము..?

ఇంతయేల..!
అస్మత్ పితామహుడు, కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు… శివసముద్రల భార్య అగు గంగ గర్భమున జనియించలేదా..!
హహ్హ..! ఈయనది ఏ కులమో..? హ హ హ హ…

నాతో చెప్పింతువేమయ్యా..!
మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు… దేవ వేశ్య అగు ఊర్వశి పుత్రుడు కాడా..!

ఆతడు పంచమి జాతి కన్య అయిన అరుంధతియందు శక్తినీ… ఆ శక్తి ఛండాలాంగానయందు పరాశరుని…
ఆ పరాశరుడు పల్లెపడతి యైన మత్స్యగంధియందు మా తాత వ్యాసుని…
ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని…
పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును…
మా ఇంటి దాసీతో ధర్మ నిర్మాణా జనుడని మీచే కీర్తించబడుతున్న హ..! ఈ విదురదేవుని కనలేదా..?

హహ్హాహ్హా..! సందర్భావసరములను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము, ఏనాడో కులహీనమైనది…
కాగా నేడు..! కులము, కులము అను వ్యర్ధ వాదములెందులకు..??

కర్ణుడి పట్టాభిషేకం

ఓహో..! రాచరికమా..! అర్హతను నిర్ణయించునది. మ్మ్ మ్మ్…
అయిన మా సామ్రాజ్యములో సస్యశ్యామలమై, సంపద విరాళమై వెలుగొందు అంగ రాజ్యమునకిప్పుడే ఈతని మూర్ధాభిషిక్తుని గావించుచున్నాను…

సోదరా.. దుశ్శాసన..!
అనర్ఘ నవరత్న శక్త కిరీటమును వేగముగా గొనితెమ్ము…

మామా.. గాంధారసార్వభౌమా..!
సురుచిరమణిమయమండిత సువర్ణ సింహాసనమును తెప్పింపుము…

పరిజనులారా…!
పుణ్య భాగీరథీ నదీ తోయములనందుకొనుడు…

కళ్యాణభట్టులారా..!
మంగల తూర్యారవములు సుస్వరముగ మ్రోగనిండు..

వంధిమాగధులారా..!
కర్ణ మహారాజును కైవారము గావింపుడు…

పుణ్యాంగనలారా..!
ఈ రాధాసుతునకు పాలభాగమున, కస్తూరీ తిలకము తీర్చిదిద్ది…
బహుజన్మ సుకృత పరీపాకసౌలబ్ద సహజ కవచ కర్ష వైడూర్య ప్రభాదిత్యోలికి వాంఛలు చెలరేగ వీర గంధము విద్యరాల్పుడు…

నేనీ సకల మహా జనసమక్షమున..! పండిత పరిషన్మధ్యమున..!
సర్వదా సర్వదా… శతదా సహస్రదా…
ఈ కుల కలంక మహాపంకిలమును
శాశ్వతముగా ప్రక్షాళనము గావించెదను…

హితుడా..!
అప్రతీహాత వీరవరేణ్యుడవగు నీకు
అంగ రాజ్యమేకాదు, నా అర్థ సింహాసనార్హత నిచ్చి గౌరవించుచున్నాను…

Like and Share
+1
43
+1
26
+1
0
Posted in Lyrics in Telugu - Movie Songs, Telugu Dialogues

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading