Menu Close

Emani Cheppani Lyrics in Telugu – Seenu

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Emani Cheppani Lyrics in Telugu – Seenu

ఏమని చెప్పను ప్రేమా ఎగిరే చిలకమ్మా
అందని ఆకాశాలే నా తీరాలమ్మా // ఏమని //
ఉదయాల సాయంకాలం హృదయాల సంధ్యారాగం
ఒక రాధ యమునాతీరం ఎదలోన మురళీగానం

ఓఓఓ… అలసట చెందిన కలలకు చందనమలదిన ఆశల్లో
నా మౌనభాషల్లో నీ కంటిబాసల్లో
నీవు నాకు నేను నీకు లోకం అంకితాలు చేసుకున్న శ్లోకం ప్రేమే అనుకోనా
ఏ కంటిపాప చూడలేని స్వప్నం మనసులోన దాగి ఉన్న గానం నీదే ఏమైనా
ఒక తోడు కోరే ప్రాణం ఎద నీడకేలే పయనం
హృదయాలు కోరే గమ్యం వెదికే ప్రేమావేశం // ఏమని //

ఓఓఓ… విరహపు యాతన విడుదల కోరిన మనసుల జంటల్లో
శ్రీరస్తు గంటల్లో శృంగార పంటల్లో
కౌగిలింత చేరుకున్న కాలం కాలమంటుకోని వింత యోగం మనదే అనుకోనా
హే… కాంచనాల కన్నె చిలక పలికే కలవరింత కంటినీరు చిలికే సమయాలొచ్చేనా…
ఆ రాధకే నా గానం ఆరాధనే నా ప్రాణం

నా గాథ ఇకపై మౌనం ఇది నా జీవనరాగం // ఏమని //

Emani Cheppani Lyrics in Telugu – Seenu

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading