Emaindo Emo Ee Vela Song Lyrics In Telugu – Tholi Prema
ఏమయిందో ఏమో ఈ వేళ… రేగింది గుండెలో కొత్త పిచ్చి
ఎంత వింతో బాగుంది ఈ వేళా… ఊగింది గాలిలో రెక్కలొచ్చి
న్యూటన్ థియరీ తల్ల కిందులై… తప్పుకున్నదా భూమికీ ఆకర్షణ
తారానగరి కళ్ళవిందులై… చూపుతున్నదా ప్రేమకున్న ఆకర్షణ
వెతకాలా వైకుంఠం కోసం… అంతరిక్షం వెనకాల
ప్రియురాలే నీ సొంతం ఐతే… అంత కష్టం మనకేల
ప్రతి కలని చిటికెలతో… పిలిచే ప్రణయాలా
జతవలలో ఋతువులనే… పట్టే సమయానా
ముల్లోకాలు గుప్పిట్లోనె చిక్కవా… ఒళ్ళోతానే స్వర్గం వచ్చి దిగదా
జనులారా ఒట్టేసి చెబుతా… నమ్ముతారా నా మాట
మనసారా ప్రేమించి చూస్తే… అమృతం అందేనంట
మిస్ లైలా మిస్సైల్ లా… స్మైలే విసిరిందా
అది తగిలి కునుకొదిలి… మనసే చదిరిందా
హద్దేకాగా లవ్ లో లవ్లీ లీల… అయ్యా నేనే ఇంకో మజ్ఞూలా
ఏమయిందో ఏమో ఈ వేళ… రేగింది గుండెలో కొత్త పిచ్చి
ఎంత వింతో బాగుంది ఈ వేళా… ఊగింది గాలిలో రెక్కలొచ్చి
న్యూటన్ థియరీ తల్ల కిందులై… తప్పుకున్నదా భూమికీ ఆకర్షణ
తారానగరి కళ్ళవిందులై… చూపుతున్నదా ప్రేమకున్న ఆకర్షణ
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.