Menu Close

Ekkadunnavu Lyrics in Telugu

అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి

Ekkadunnavu Lyrics in Telugu

పల్లవి:
చుక్కల తోటలో ఎక్కడున్నావో
పక్కకు రావే మరుమల్లె పువ్వా

చక్కని జాబిలి ఎక్కడుంటాను
నీ పక్కనే చుక్కనై పలకరిస్తాను

చరణం: 1
నీలి నీలి నీ కురుల నీలాల మేఘాల
విరిసింది మల్లిక నా రాగ మాలిక
అల్లిబిల్లి నీ కౌగిట అల్లుకున్న నా మమత
కొసరింది కోరిక అనురాగ గీతిక

నీ మూగ చూపులలో…చెలరేగే పిలుపులలో
నీ పట్టు విడుపులలో…సుడి రేగే వలపులలో
కన్ను కన్ను కలవాలి కలసి వెన్నెలై పోవాలి
చీకటి వెన్నెల నీడలలో దాగుడు మూతలు ఆడాలి

చరణం: 2
ఆకలైన నాకు తెలుసు కౌగిలెంత తీయనిదో..
కౌగిలింతకే తెలుసు ఆకలెంత తీరనిదో
వేచి వున్న నాకు తెలుసు విరహమెంత తీయనిదో..
కాచుకున్న నీకు తెలుసు కలయికెంత కమ్మనిదో

ఈ పూల వానలలో తడిసిన నీ అందాలు ఆ…
ఈ పూట సొగసులలో కురిసిన మకరందాలు
నీలో తీగలు మీటాలి..నాలో రాగం పలకాలి
లోకం మరచిన మైకంలో మనమే ఏకం కావాలి

Ekkadunnavu Lyrics in Telugu

Like and Share
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading