ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Ee Reyi Teeyanidi Lyrics In Telugu – Johny – ఈ రేయి తీయనిది
ఈ రేయి తీయనిది… ఈ చిరుగాలి మనసైనది
ఈ హాయి మాయనిది… ఇంతకుమించి ఏమున్నది
ఏవేవో కోరికలు… ఎదలో ఝుమ్మని అంటున్నవి
ఆ కొంటె మల్లికలు… అల్లన దాగి వింటున్నవి
ఏవేవో కోరికలు… ఎదలో ఝుమ్మని అంటున్నవి
ఆ కొంటె మల్లికలు… అల్లన దాగి వింటున్నవి
ఆ ఆ ఆ ఆ…
పరువాలు పల్లవి పాడగా… నయనాలు సయ్యాటలాడగా
పరువాలు పల్లవి పాడగా… నయనాలు సయ్యాటలాడగా
నిను చేరుకోగా… నునుమేని తీగ
పులకించి పోయెను… తొలకరి వలపుల
ఈ రేయి తీయనిది… ఈ చిరుగాలి మనసైనది
ఈ హాయి మాయనిది… ఇంతకుమించి ఏమున్నది
ఎన్నెన్ని జన్మల బంధమో… ఏ పూల నోముల పుణ్యమో
ఎన్నెన్ని జన్మల బంధమో… ఏ పూల నోముల పుణ్యమో
నిను నన్ను కలిపె… నీ నీడ నిలిపె
అనురాగ సీమల… అంచులు దొరికె
ఈ రేయి తీయనిది… ఈ చిరుగాలి మనసైనది
ఈ హాయి మాయనిది… ఇంతకుమించి ఏమున్నది.. ..
Ee Reyi Teeyanidi Lyrics In Telugu – Johny – ఈ రేయి తీయనిది