Menu Close

Ee Jeevana Tharangalalo Lyrics in Telugu

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Ee Jeevana Tharangalalo Lyrics in Telugu

పదిమాసాలు మోశావు పిల్లలను
బ్రతుకంతా మోశావు బాధలను
ఇన్ని మోసిన నిన్ను మోసేవాళ్ళు లేక వెళుతున్నావు
ఈ జీవనతరంగాలలో ఆ దేవుని చదరంగంలో
ఎవరికి ఎవరు సొంతమూ ఎంతవరకీ బంధమూ
కడుపు చించుకు పుట్టిందొకరూ కాటికి నిన్ను మోసేదొకరూ
తలకు కొరివి పెట్టేదొకరూ ఆపై నీతో వచ్చేదెవరూ
ఆపై నీతో వచ్చేదెవరూ

ఈ జీవనతరంగాలలో ఆ దేవుని చదరంగంలో
ఎవరికి ఎవరు సొంతమూ ఎంతవరకీ బంధమూ

మమతే మనిషికి బంధిఖానా భయపడి తెంచుకు పారిపోయినా
తెలియని పాశం వెంటపడి ఋణం తీర్చుకోమంటుంది
తెలియని పాశం వెంటపడి ఋణం తీర్చుకోమంటుంది
నీ భుజం మార్చుకోమంటుంది

ఈ జీవనతరంగాలలో ఆ దేవుని చదరంగంలో
ఎవరికి ఎవరు సొంతమూ ఎంతవరకీ బంధమూ

తాళికట్టిన మగడు లేడనీ తరలించుకు పోయే మృత్యువాగదూ
ఈ కట్టెను కట్టెలు కాల్చక మానవూ
ఆ కన్నీళ్ళకు చితిమంటలారవూ
ఈ మంటలు ఆ గుండెను అంటక మానవూ

ఈ జీవనతరంగాలలో ఆ దేవుని చదరంగంలో
ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకీ బంధము
ఈ జీవనతరంగాలలో ఓ ఓ

Ee Jeevana Tharangalalo Lyrics in Telugu

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading