Edo Oka Raagam Song Lyrics In Telugu – Raja
ఏదో ఒకరాగం పిలిచిందీవేళా… ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా…
ఏదో ఒకరాగం పిలిచిందీవేళా… ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా…
నా చూపుల దారులలో… చిరుదీపం వెలిగేలా…
నా ఊపిరి తీగలలో… అనురాగం పలికేలా… ఆ ఆ
జ్ఞాపకాలె మైమరపూ… జ్ఞాపకాలె మేల్కొలుపు
జ్ఞాపకాలె నిట్టూర్పూ… జ్ఞాపకాలె ఓదార్పు…
ఏదో ఒకరాగం పిలిచిందీవేళా…
ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా…
వీచే గాలులలో… నీ ఊసులు జ్ఞాపకమే… పూచే పువ్వులలో నీ నవ్వులు జ్ఞాపకమే
తూరుపు కాంతుల ప్రతికిరణం నీ కుంకుమ జ్ఞాపకమే…
తులసి మొక్కలో నీ సిరుల జ్ఞాపకం…
చిలుక ముక్కులా నీ అలక జ్ఞాపకం…
ఏదో ఒకరాగం పిలిచిందీవేళా…
ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా…
మెరిసే తారలలో… నీ చూపులు జ్ఞాపకమే
ఎగసే ప్రతి అలలో… నీ ఆశలు జ్ఞాపకమే…
కోవెలలోనీ దీపంలా… నీ రూపం జ్ఞాపకమే…
పెదవిపైన నీ పేరే… చిలిపి జ్ఞాపకం…
మరుపు రాని నీ ప్రేమే… మధుర జ్ఞాపకం