Menu Close

Dheera Sameere Yamuna Theere Song Lyrics In Telugu – Dharma Chakram


ధీర సమీరే యమునా తీరే… వసతివనే వనమాలి
గ్రామ సమీపే ప్రేమ కలాపే… చెలి తగునా రసకేళి
ఆకాశమే నా హద్దుగా… నీ కోసమొచ్చా ముద్దుగా
తెచ్చానురా మెచ్చనురా… గిచ్చేయి నచ్చిన సొగసులు

ధీర సమీరే యమునా తీరే… వసతివనే వనమాలి
గ్రామ సమీపే ప్రేమ కలాపే… చెలి తగునా రస కేళి

వేసంగి మల్లెల్లో శీతంగి వెన్నెల్లో
వేసారి పోతున్నారా… రా రా
హేమంత మంచుల్లో… ఏకాంత మంచంలో
వేటాడుకుంటున్నానే నిన్నే
మొటిమ రగులు సెగలో
తిరగబడి మడమ తగులు వగలో
చిగురు వణుకు చలిలో
మదనుడికి పొగరు పెరిగే పొదలో
గోరింట పొద్దుల్లోన పేరంటాలే ఆడే వేళ

ధీర సమీరే యమునా తీరే
వలచితి నే వనమాలి
గ్రామ సమీపే ప్రేమ కలాపే
ప్రియ తగునా రసకేళి

లేలేత నీ అందం… నా గీత గోవిందం
నా రాధ నీవే లేవే రావే
నీ గిల్లికజ్జాలు జాబిల్లి వెచ్చాలు
నా ఉట్టి కొట్టేస్తున్నా రావా
వయసు తెలిసే ఒడిలో
ఎద కరిగి తపన పెరుగు తడిలో
మనువు కుదిరే మదిలో
ఇంకిపుడు చనువు ముదురు గదిలో
వాలారు సందెల్లోన వయ్యారాలే తాకే వేళ

ధీర సమీరే యమునా తీరే
వలచితి నే వనమాలి
ఆ ఆఆ ఆ, గ్రామ సమీపే ప్రేమ కలాపే
ప్రియ తగునా రసకేళి
ఆకాశమే నా హద్దుగా… నీ కోసం వచ్చా ముద్దుగా
తెచ్చానురా మెచ్చనురా… గిచ్చేయి నచ్చిన సొగసులు

ధీర సమీరే యమునా తీరే
వసతివనే వనమాలి
గ్రామ సమీపే ప్రేమ కలాపే
చెలి తగునా రసకేళి

Like and Share
+1
0
+1
1
+1
0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading