ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
పచ్చపచ్చ సెట్టు సేమ… పట్టు సీరెలంటా
నల్ల నల్ల ముళ్ళ కంప… నల్ల పూసలంటా
కిచ కిచలాడే ఉడుత పిచ్చుక… లాలి పాటంటా
గలగల పారే సేలలో నీళ్లు సనుబాలంట, ఆ ఆ
అడవితల్లి ఇంటికొచ్చిన… దగ్గరి సుట్టాలం
వనలచ్చిమి ఒడిలో… కట్టాలన్నీ గట్టెక్కిచ్చేద్దాం
అడవితల్లి ఇంటికొచ్చిన… దగ్గరి సుట్టాలం
వనలచ్చిమి ఒడిలో… కట్టాలన్నీ గట్టెక్కిచ్చేద్దాం
ధంధం ధం తిరిగేద్దాం
ధంధం ధం దొర్లేద్దాం
ధంధం ధం తిరిగేద్దాం
ధంధం ధం దొర్లేద్దాం
ధం ధం ధం… తిరిగేద్దాం
ధం ధం ధం… దొర్లేద్దాం
ధం ధం ధం ధం దయ చూపలని
అడవిని అడిగేద్దాం
మన పాణాలన్నీ నిలిపే తల్లికి
సాగిల పడిపోదాం, ఆ ఆఆ
పొగమంచేమో సామ్రానేసి
ప్రేమగ తలనే నిమిరేనంట
సేతికి తగిలే పేడు బెరడు
తాయెత్తల్లే తడిమెనంట
మద్దే టేకు ఆకులు మనకు
విసన కర్రలు విసిరేనంట, హ హ హ
గడ్డి గరిక పచ్చిక మనకు
పరుపే పరిసి పిలిసేనంటా, హో
ధంధం ధం సూసేద్ధాం
ధంధం ధం సుట్టేద్దాం
ధంధం ధం అడవే మనకు
కోవెల అనుకుందాం
కోరక ముందే వరాలనిచ్చే
తల్లిని కొలిసేద్ధాం, ఆ ఆఆ
సుక్క సుక్కా దాచలంటూ
తేనేటీగే తెలిపేనంటా
సురుకుంటేనే బతుకుందంటూ
దుప్పి కడితీ సెప్పేనంటా
పెద్దపులితో తలపడు ధైర్యం
అడవి పందే నేర్పేనంటా
కలిసే ఉంటే బలముందంటూ
రేసు కుక్కలు సాటేనంట
పొట్టకూటికి ఏటాడేటి జీవులు సెప్పే పాటం ఒకటే
తిన్న ఇంటిని ధ్వంసం సేసే
పాపానికి ఒడికట్టొద్దంతే, ఏ ఏఏ
ధంధం ధం సదివేద్దాం
ధంధం ధం నేర్సేద్దాం
ధంధం ధం ఈ పాఠాలను
బతుకున పాటిద్దాం
అడవిని మించిన బడి లేదంటూ
అడుగులు కదిపేద్దాం, ఆఆ ఆఆ ఆ