ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Devara Movie Review in Telugu – దేవర మూవీ రివ్యూ – Part 1
Devara Movie Review: ఆరేళ్ల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా నటించగా విడుదలైన సినిమా “దేవర పార్ట్ 1”. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంతో జాన్వికపూర్ కథానాయికగా తెలుగు తెరకు పరిచయమవ్వగా.
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ప్రతినాయక పాత్ర పోషించాడు. మరి రాజమౌళి ఎఫెక్ట్ నుండి ఎన్టీఆర్ మూడోసారైనా తప్పించుకోగలిగాడా? కొరటాల “ఆచార్య”తో కోల్పోయిన క్రెడిబిలిటీ మళ్లీ సంపాదించుకోగలిగాడా? అనేది చూద్దాం..!
జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీలో జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటించింది. సైఫ్ అలీఖాన్ విలన్‌గా కనిపించాడు. పాన్ ఇండియన్ లెవెల్‌లో భారీ అంచనాలు నడుమ రిలీజైన ఈ మూవీ ఎలా ఉంది? సోలో హీరోగా లాంగ్ గ్యాప్ తర్వాత ఎన్టీఆర్‌కు హిట్ దక్కిందా? లేదా? అంటే?
ఎలివేషన్లు, హీరోయిజం: ప్రస్తుతం కమర్షియల్ సినిమాకు అర్థం మారిపోయింది. కథ కంటే హీరో ఇమేజ్, ఎలివేషన్లు, హీరోయిజం నమ్ముకునే దర్శకులు సినిమాలు చేస్తున్నారు. అదే బాక్సాఫీస్ సక్సెస్ ఫార్ములాగా మారిపోయింది. దేవరతో ఆ ట్రెండ్‌ను ఫాలో అయ్యాడు డైరెక్టర్ కొరటాల శివ. కథ కంటే కథనం, యాక్షన్ ఎపిసోడ్స్‌తోనే ఎన్టీఆర్ అభిమానులను మెప్పించే ప్రయత్నం చేశాడు.
క్లైమాక్స్ ట్విస్ట్: క్లైమాక్స్‌ను ఓ ట్విస్ట్‌తో ఎండ్ చేశాడు కొరటాల శివ. అది గతంలో తెలుగులో వచ్చిన ట్రెండ్ సెట్టర్ మూవీని గుర్తు చేస్తుంది. ఆ ట్విస్ట్ వెనకున్న కథ ఏమిటన్నది సెకండ్ పార్ట్‌లో చూడాలంటూ లీడ్ ఇచ్చాడు.
ఏదో ఒక బలమైన సామాజికాంశాన్ని తీసుకొని దానికి కమర్షియల్ హంగులు, ఎమోషన్స్‌తో సినిమా చేయడం కొరటాల శివ స్టైల్. కానీ ఈ సినిమాలో ఆ మ్యాజిక్ మిస్సయింది. కథ చాలా సాదాసీదాగా అనిపిస్తుంది. కథలో నెక్స్ట్ ఏం జరుగబోతుందన్నది ఈజీగా గెస్ చేసేలా ఉంది.
ట్విస్ట్‌లు కూడా సింపుల్‌గానే ఉన్నాయి. ఎన్టీఆర్, జాన్వీకపూర్ లవ్‌స్టోరీని సోసోగానే అనిపిస్తుంది. యాక్షన్ సన్నివేశాలు మినహా మిగిలిన సన్నివేశాల్లో కొరటాల మార్కు ఎక్కడ కనిపించదు.
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు మాత్రమే: దేవర ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను మెప్పించే మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ. కథలో లోపాలు ఉన్నా ఎన్టీఆర్ యాక్టింగ్, హీరోయిజం కోసం ఈ మూవీని చూడొచ్చు.
50 Janhvi Kapoor Latest Images in Saree – Cute, Traditional, HOT