ఫోకస్డ్ గా పని చెయ్యడం ఎలా – Deep Work Explained in Telugu – Book Recommendations
“విజయం అనేది ప్రతిభ మీద కాదు, శ్రద్ధ మీద ఆధారపడి ఉంటుంది.”
పేరు: Deep Work: Rules for Focused Success in a Distracted World
రచయిత: కాల్ న్యూపోర్ట్ (Cal Newport)
విడుదల తేదీ: జనవరి 5, 2016
అమ్మకాల సంఖ్య: ఈ పుస్తకం 1.5 మిలియన్ కాపీలు పైగా అమ్ముడయ్యాయి
భాషలు: 40కి పైగా భాషల్లో అనువాదం చేయబడింది
ప్రచురణకర్త: గ్రాండ్ సెంట్రల్ పబ్లిషింగ్ (Grand Central Publishing)

ఈ పుస్తకం లో ప్రధాన అంశాలు:
- పనిలో నైపుణ్యం సాధించడం
- గాఢమైన పని (Deep Work) యొక్క విలువ
- డిస్టర్బెన్స్‌లను అధిగమించడం
- సామాజిక మాధ్యమాలపై నియంత్రణ
Important Points from the book Deep Work in Telugu
- మనం రోజంతా బిజీగా ఉంటున్నట్టు అనిపిస్తుంది. కానీ రోజు చివరికి చూసుకుంటే నిజంగా ఎంత పనైంది అన్న ప్రశ్నకు సమాధానం వుండదు. దీనికి కారణం మనం ఎంత శ్రద్ధతో పని చేస్తున్నాం అనే దాని మీద ఆదారపడి వుంటుంది.
- కాల్ న్యూపోర్ట్ రాసిన “Deep Work” అనే పుస్తకం, ఈ సమస్యకు సరైన దారి చూపుతుంది. ఈ పుస్తకం తక్కువ సమయంలో ఎక్కువ ఫలితం రావాలంటే, మనం మన దృష్టిని ఒక్క పనిపైనే వుంచాలి అని చెబుతుంది.
- Deep Work అంటే – మన ఆలోచనంతా ఒకే పని మీద దృష్టిపెట్టి, మధ్యలో ఏ డిస్ట్రాక్షన్ లేకుండా పని చేయడం.
- ఈ రకమైన పని చేసే అలవాటు మనకు ఉన్నదంటే, అది మన జీవితాన్ని చాలా వేగంగా, మంచి దిశగా నడిపిస్తుంది.
- మనలో ఉన్న ప్రతిభ బయటకు రావాలంటే, మన శ్రద్ధపై మనకే నియంత్రణ ఉండాలి.
- ప్రతి చిన్న నోటిఫికేషన్ కి ఫోన్ చెక్ చేయడం, ఒకేసారి ఎక్కువ ఎక్కువ చెయ్యడానికి ప్రయత్నించడం – ఇవన్నీ మన పనులు సక్రమంగా అవ్వకపోవడానికి కారణాలు.
- చాలా మందికి “Busy” అనే ఫీలింగ్ ఉంటుంది, కానీ “productivity” ఉండదు. అదే shallow work.
- Shallow work అంటే – ఈమెయిల్స్, మెసేజ్‌లు, చిన్న చిన్న అప్డేట్లతో గడిపే సమయం. ఇవి మానసికంగా అలసటను కలిగిస్తాయి, కానీ మన లక్ష్యం దిశగా ముందుకెళ్లనివ్వవు.
- Deep work చేయగలిగితే – మన పని నాణ్యత పెరుగుతుంది, నిర్ణయాలు స్పష్టంగా తీసుకోగలుగుతాం, పనిలో తలమునక అయిపోతాం, మనం నిజంగా నెగ్గినట్టే ఉంటుంది.
- రోజుకు కనీసం ఒక గంటైనా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా పని చేయాలన్న ధృఢ నిశ్చయం మనకుండాలి.
- ఫోన్‌ను సైలెంట్ చేయడం కాదు – పక్కకు పెట్టేయడం అవసరం.
- సోషల్ మీడియా టైమ్‌ని నియంత్రించగలిగితే, మన శ్రద్ధ మనదే అవుతుంది.
- పని చేసేటప్పుడు ఎలాంటి ఇతర పనులు ఆలోచించకుండా ఉండటం అలవాటు చేసుకోవాలి.
- మనం ఒకే టైంలో, ఒకే ప్రదేశంలో పని చేయడం వల్ల మన మెదడు ఆ పద్ధతిని గుర్తుపెట్టుకుంటుంది.
- Deep work అలవాటుతో మీ కెరీర్ లో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది.
- మీరు చేసే పనిపై మీకే గర్వంగా ఉంటుంది.
- మన పనికి విలువ పెరుగుతుంది
- తక్కువ టైంలో అధిక ఫలితాలు సాధించవచ్చు
- ప్రతిభతో పాటు శ్రద్ధతో పని చెయ్యడం కూడా ముఖ్యం.
Deep Work అలవాటు చేసుకోవాలంటే ఇవి పాటించాలి:
- రోజుకు కనీసం ఒక గంట కాలం uninterrupted గా పనిచేయాలన్న సంకల్పం ఉండాలి.
- పని చేసే సమయంలో ఫోన్, సోషల్ మీడియా లాంటి డిస్టర్బెన్సులను పూర్తిగా దూరం పెట్టాలి.
- రోజులో ముందుగా ఒక సమయపట్టిక సిద్ధం చేసుకొని, ఎప్పుడు ఏ పని చేయాలో క్లియర్‌గా నిర్ణయించుకోవాలి.
- మనం పని చేసే ప్రదేశం శాంతంగా, శ్రద్ధ పెట్టడానికి అనువుగా ఉండాలి.
- ప్రతిరోజూ పనులు పూర్తయ్యాక ‘shut down’ అనేది మనసులోనూ జరగాలి. అంటే పని ముగిసిన వెంటనే దానితో మనం మానసికంగా కూడా విడిపోవాలి.
Deep work అనేది ఒక జీవనశైలి కావాలి. దాన్ని అలవాటు చేసుకుంటే, మనం ఎంతటి పనైనా సమర్థంగా చేయగలుగుతాం.
పని చేసే ప్రతి ఒక్కరూ తప్పకుండా చదవాల్సిన పుస్తకం ఇది, ఇక్కడ తెలుగులో చదవండి – Deep Work in Telugu
జీవితాన్ని సింపుల్ గా చూస్తేనే ఆనందంగా వుంటాం – The Subtle Art of Not Giving a F*ck
Like and Share
+1
1
+1
+1