Danchave Menatha Kuthura Lyrics In Telugu – Mangammagari Manavadu’
చాటల్ల బియ్యం దంచకపొద్దు.. తెత్తున గైరమ్మ నీ సేవకు
ఆహూ ఆహూ… ఆహూ ఆహూ
చాటల్ల సజ్జలు చెయ్ ఒక్క పొద్దు… తెత్తున బైరమ్మ నీ సేవకు
ఆహూ ఆహూ… ఆహూ ఆహూ
చిటికెన ఏలంత సిన్నారి మొగుడూ… సిట్టెమ్మకోలమ్మ పుట్టెడు సిగ్గు
ఆహూ ఆహూ… ఆహూ ఆహూ
దంచవే మేనత్త కూతురా… వడ్లు దంచవే నా గుండెలదరా
దంచు దంచు బాగా దంచు… ఆ, దంచు దంచు బాగా దంచు
దంచవే మేనత్త కూతురా… వడ్లు దంచవే నా గుండెలదరా
హ హ హ హా
దంచవే మేనత్త కూతురా… వడ్లు దంచవే నా గుండెలదరా
దంచు దంచు బాగా దంచు… అరె, దంచు దంచు బాగా దంచు
దప్పి పుట్టినా కాస్త నొప్పి పెట్టినా
ఆగకుండ, ఆపకుండ… అందకుండ, కందకుండ
దంచవే మేనత్త కూతురా… వడ్లు దంచవే నా గుండెలదరా
పోటు మీద పోటు వెయ్యి… పూత వయసు పొంగనియ్యి
ఎడమ చేత ఎత్తిపట్టు… కుడి చేత కుదిపి కొట్టు
పోటు మీద పోటు వెయ్యి… పూత వయసు పొంగనియ్యి
ఎడమ చేత ఎత్తిపట్టు… కుడి చేత కుదిపి కొట్టు
ఏ చెయ్యి ఎత్తితేమి… మరి ఏ చెయ్యి దించితేమి
హ… ఏ చెయ్యి ఎత్తితేమి… మరి ఏ చెయ్యి దించితేమి
అహ్హహ్హహ్హా…
కొట్టినా నువ్వే… పెట్టినా నువ్వే
పట్టుబట్టి తాళిబొట్టు… కట్టినా నువ్వే
హా… దంచుతా మంగమ్మ మనవడా, ఓయ్
నేను దంచితే నీ గుండె దడదడ… హా హా హా హా హాహా
దంచుతా మంగమ్మ మనవడా.. ఓయ్ ఓయ్
నేను దంచితే నీ గుండె దడ దడ
కోరమీసం దువ్వబోకు… కోక చుట్టూ తిరగమాకు
ఎగిరెగిరి పైన పడకు… ఇరుగు చూస్తే టముకు టముకు
కోరమీసం దువ్వబోకు… కోక చుట్టూ తిరగమాకు
ఎగిరెగిరి పైన పడకు… ఇరుగు చూస్తే టముకు టముకు
ఏ కంట పడితేమి… ఎవ్వరేమంటే మనకేమి
అరె… ఏ కంట పడితేమి… ఎవ్వరేమంటే మనకేమి
నువ్వు పుట్టంగనే బట్ట కట్టంగనే… నిన్ను కట్టుకునే హక్కున్న
పట్టాదారుణ్ణి నేను…
దంచవే మేనత్త కూతురోయ్
వడ్లు దంచవే నా గుండెలదరదరదర
హా.. దంచుతా మంగమ్మ మనవడా
నేను దంచితే నీ గుండె దడ దడ
హా హా హా హా… హాహాహాహా
హా హా హా హా… హాహాహాహా