ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Chukkallara Lyrics in Telugu – Apathbhandavudu
పల్లవి :
చుక్కలారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిలీ
మబ్బుల్లారా మంచుల్లారా తప్పుకోండీ దారికీ
వెళ్ళనివ్వరా వెన్నెలింటికీ?
విన్నవించరా వెండి మింటికీ?
జో జో.. లాలీ… జో జో… లాలీ
చరణం 1 :
మలి సంధ్య వేళాయే.. చలి గాలి వేణువాయే నిదురమ్మా ఎటు పోతివే
మునిమాపు వేళాయే.. కనుపాప నిన్ను కోరె కునుకమ్మా ఇటు చేరవే
నిదురమ్మా ఎటు పోతివే? కునుకమ్మా ఇటు చేరవే..
నిదురమ్మా ఎటు పోతివే? కునుకమ్మా ఇటు చేరవే..
గోధూళి వేళాయే.. గూళ్ళని కనులాయే
గోధూళి వేళాయే.. గూళ్ళని కనులాయే
గువ్వల రెక్కల పైనా రివ్వు రివ్వున రావే
జోల పాడవా బేల కళ్ళకి.. వెళ్ళనివ్వరా వెన్నెలింటికీ
జో జో లాలీ.. జో జో లాలీ… జో జో లాలీ.. జో జో లాలీ
Chukkallara Lyrics in Telugu – Apathbhandavudu
Like and Share
+1
+1
+1