హే చుక్కలు చున్నీకే
నా గుండెని కట్టావే ఆ నీలాకాశంలో
అరె గిర్రా గిర్రా తిప్పేసావే
మువ్వల పట్టికే నా ప్రాణం చుట్టావే
నువెళ్ళే దారంతా అరే ఘల్లు ఘల్లు మోగించావే
వెచ్చ వెచ్చని ఊపిరి తోటి ఉక్కిరి బిక్కిరి చేసావే
ఉండిపో ఉండిపో ఉండిపో నాతోనే
హొయ్యారే హొయ్యారే హొయ్యా హొయ్యా
నీ వల్లే నీ వల్లే పిచ్చోడిలా తయారయ్యా
హొయ్యారే హొయ్యారే హొయ్యా హొయ్యా
నీ వల్లే నీ వల్లే నాలో నేనే గల్లంతయ్యా
హే కొత్త కొత్త చిత్రాలన్నీ ఇప్పుడే చూస్తున్నాను
గుట్టుగా దాచుకో లేను డప్పే కొట్టి చెప్పలేను
పట్టలేని ఆనందాన్ని ఒక్కడినే మొయ్యలేను
కొద్దిగా సాయం వస్తే పంచుకుందాం నువ్వు నేను
కాసేపు నువ్వు కన్నార్పకు నిన్నులో నన్ను చుస్తూనే ఉంటా
కాసేపు నువ్వు మాట్లాడకు కౌగిళ్ళ కావ్యం రాసుకుంటా
ఓ ఎడారిలా ఉండే నాలో సింధు నధై పొంగావె
ఉండిపో ఉండిపో ఎప్పుడు నాతోనే
హొయ్యారే హొయ్యారే హొయ్యా హొయ్యా
నీ వల్లే నీ వల్లే పిచ్చోడిలా తయారయ్యా
హొయ్యారే హొయ్యారే హొయ్యా హొయ్యా
నీ వల్లే నీ వల్లే నాలో నేనే గల్లంతయ్యా
బాధనే భరించడం అందులోంచి బయటికి రాడం
చాల చాల కష్టం అని ఏంటో అంతా అంటుంటారే
వాళ్ళకి తెలుసో లేదో హాయిని భరించడం
అంతకన్నా కష్టం కాదా అందుకు నేనే సాక్ష్యం కాదా
ఇంతలా నేను నవ్వింది లేదు ఇంతలా నన్ను పారేసుకో లేదు
ఇంతలా నీ జుంకా లాగ మనసేన్నడు ఊగలేదు
ఓ దాయి దాయి అంటూ ఉంటె చందమామే వచ్చావే
ఉండిపో ఉండిపో తోడుగా నాతోనే
హొయ్యారే హొయ్యారే హొయ్యా హొయ్యా
నీ వల్లే నీ వల్లే పిచ్చోడిలా తయారయ్యా
హొయ్యారే హొయ్యారే హొయ్యా హొయ్యా
నీ వల్లే నీ వల్లే నాలో నేనే గల్లంతయ్యా
Song Details:
Movie : SR Kalyanamandapam
Song : Chukkala chunni
Lyrics: Bhaskarabhatla
Music: Chaitan Bharadwaj
Singer: Anurag Kulkarni
Music Label: Lahari Music.