ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Chudare Siluvanu Vreladu Yesayya Lyrics In Telugu – Telugu Christian Songs
చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను
పాడు లోకంబునకై… గోడు జెందే గదా
చూడరే సిలువను… వ్రేలాడు యేసయ్యను
పాడు లోకంబునకై… గోడు జెందే గదా
నా చేతులు చేసినట్టు… దోషంబులే గదా
నా రాజు చేతులలో… ఘోరంపు జీలలు
చూడరే సిలువను… వ్రేలాడు యేసయ్యను
పాడు లోకంబునకై… గోడు జెందే గదా
దురితంపు దలపులే… పరమ గురిని శిరముపై
నెనరు లేక మొత్తెనయ్యొ… ముండ్ల కిరీటమై
చూడరే సిలువను… వ్రేలాడు యేసయ్యను
పాడు లోకంబునకై… గోడు జెందే గదా
పరుగెత్తి పాదములు… చేసిన పాపంబులు
పరమ రక్షకుని… పాదములలో మేకులు
చూడరే సిలువను… వ్రేలాడు యేసయ్యను
పాడు లోకంబునకై… గోడు జెందే గదా
పాపేఛ్చ తోడ గూడు… నాడు చెడ్డ పడకలే
పరమ గురుని ప్రక్కలోని… బల్లెంపు పోటులు
చూడరే సిలువను… వ్రేలాడు యేసయ్యను
పాడు లోకంబునకై… గోడు జెందే గదా