Chinni Chinni Aasa Lyrics in Telugu – Roja
చిన్ని చిన్ని ఆశ చిన్నదని ఆశ
ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆశ
జాబిలిని తాకి ముద్దులిడు ఆశ
వెన్నెలకు తోడై ఆడుకొను ఆశ(చిన్ని)
పూవులా నేనే నవ్వుకోవాలి
గాలినే నేనై సాగిపోవాలి
చింతలే లేక చిందులేయాలి
వేడుకలలోనా తేలిపోవాలి
తూరుపు రేఖ వెలుగు కావలి(చిన్ని)
చేనులో నేనే పైరు కావాలి
కొలనులో నేనే అలను కావాలి
నింగి హరివిల్లు వంచి చూడాలి
మంచు తెరలోనే నిదురపోవాలి
చైత్రమాసం లో చినుకు కావాలి(చిన్ని)