Menu Close

పిల్లలకి చదువు తప్ప మరో లోకం వుండకూడదు.. ఆటలు, పాటలు అంటే కాళ్ళు విరకొడదాం-Sports in India

Encouragement and support for Sports in India by parents, teachers and the government really appreciable.

Olympic Medals list by Country wise in 2020-2021.

  • అమెరికా – 39(గోల్డ్) + 41(సిల్వర్) + 33(బ్రోంజ్) = 113 పథకాలు
  • చైనా – 38(గోల్డ్) + 32(సిల్వర్) + 18(బ్రోంజ్) = 88 పథకాలు
  • జపాన్ – 27(గోల్డ్) + 14(సిల్వర్) + 17(బ్రోంజ్) = 58 పథకాలు
  • బ్రిటన్ – 22(గోల్డ్) + 21(సిల్వర్) + 22(బ్రోంజ్) = 65 పథకాలు
  • భారత్ – 1(గోల్డ్) + 2(సిల్వర్) + 4(బ్రోంజ్) = 7

భారత దేశం లో ప్రతి ఒక్కరూ గర్వ పడాల్సిన సమయ ఇది.
అవును ఎందుకంటే మన దేశానికి కూడా ఒక బంగారు పథకం వచ్చింది.
అవును ఒక్క బంగారు పథకం. ఇంతకన్నా ఏం కావాలి.
ఈ బంగారు పథకానికి దేశం అంతా సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి,
తప్పేముంది సంబరాలు చేసుకోవాల్సిన విషయమే కదా..

Limited Offer, Amazon Sales
Fire-Boltt Smart Watch at Lowest Price
Buy Now

4 యేళ్ళ క్రితం జరిగిన ఒలింపిక్స్ లో మన దేశానికి 6 పథకాలు, ఈ సారి 7 పథకాలు. అద్బుతం, అమోఘం..
కేవలం నాలుగేళ్లలోనే ఇంత ప్రతిభ పెరిగింది మన దేశం లో … నిజంగా గర్వించ దగ్గ విషయం ఇది.

మరి 39 బంగారు పథకాలను సాదించిన అమెరికా లో సంబరాలు ఇంకెంతలా వుంటాయీ కదా..
పోనీలే వాళ్ళ గురుంచి మనకెందుకు,
మనం ఇలానే బాగా వేగంగా పాకుతూ ముందుకు పోదాం..

అయినా మనకెందుకు ఈ ఆటలు.., కూటికా ..? గుడ్డకా..?
పథకాలు సాదిస్తేనే ప్రోత్సాహకాలు లేకపోతే దమ్మీడీ రాదు..
అంతంత కర్చు పెట్టి వృధా…

ముందుగా మన తల్లి తండ్రుల గురుంచి చెప్పుకోవాలి, వారి ఆలోచన విధానానికి శత కోటి వందనాలు.
మన పిల్లలు మంచిగా చదువుకోవాలి, అయితే ఇంజినీర్ లేకపోతే డాక్టర్ అదీ కుదరకపోతే ప్రభుత్వ ఉద్యోగం. ఇంకేం కావాలి చెప్పండి.
ఒక ఇల్లు , ఒక కారు , పెళ్లి ఇద్దరు పిల్లలు.. ఇంతకన్నా సాదించాల్సింది ఏముంది చెప్పండి.
అలానే కదా మన తాతలు బ్రతికింది,
అలానే కదా మనమూ బ్రతికింది,
మరి అలానే కదా మన పిల్లలు బ్రతకాల్సింది కూడా.
అలానే నడిపిద్దాం, అస్సలు పక్కదారి పట్టకుండా చూసుకుందాం..
వీళ్ళుకి లక్ష్యాలు, ద్యేయాలు అని ఏవేవో అంటారు అస్సలు వినకూడదు మనం.
మనసుకి నచ్చింది చేస్తా.. అందులోనే నేను ఏదుగుతా అంటారు అస్సలు పట్టించుకోకూడదు మనం.

మన పిల్లలకి పాఠాలు చెప్పే వాళ్ళ గురుంచి కూడా చెప్పుకోవాలి, మన తల్లిదండ్రుల తరవాత వాళ్లే కదా ముఖ్యమైన వాళ్ళు
ఈ పిల్లలు పొరపాటున తల్లిదండ్రుల మాట వినకపోతే దారి తప్పకుండా చూసుకోవాల్సిన బాద్యత వీళ్ళదే కదా..
ఆటలంటూ ఎవరైనా గ్రౌండ్ లోకి వెళ్తే కాళ్ళు విరకొట్టాలి..
పుస్తకం, అక్షరాలు తప్ప పిల్లల కళ్ళకి మరొకటి కనిపించకూడదు..

అనవసరంగా ఈ బాలల దినోత్సవం పెట్టారు, ఆ పేరు చెప్పుకుని పిల్లల్ని ఇష్టమొచ్చినట్టు ఆటలాడిస్తున్నారు, సగం పిల్లల భవిష్యత్తు నాసనమవ్వడానికి కారణం కూడా అదే కదా..!

Limited Offer, Amazon Sales
Boult Earbuds at Just Rs.799
Buy Now

పిల్లలకి చదువు తప్ప మరో లోకం వుండకూడదు…..

మాతృదేవోభావ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ.

Like and Share
+1
1
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
బిగ్గ్ బాస్ 8 తెలుగులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ?

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading