ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Chilakamma Palikindi Lyrics in Telugu
పల్లవి:
చిలకమ్మ పలికింది..చిగురాకు కులికింది
చిలకమ్మ పలికింది..చిగురాకు కులికింది
చిరునవ్వు చిలికించవే ..నీ లేత సింగారమొలికించవే..
నీ లేత సింగార మొలికించవే..
గోరొంక కూసింది..గోరింట పూసింది..
గోరొంక కూసింది..గోరింట పూసింది
ముత్యాల మనసీయ్యరా… నీ తీపి ముద్దుల్లో ముంచెయ్యరా…
నీ తీపి ముద్దుల్లో ముంచెయ్యరా…
చరణం 1:
పాల బుగ్గ కందితే తెలిసిందీ పూల సిగ్గు పూచిందనీ…
ఆ ఆ హా..హ..హా..ఆ..హ…
పైట కొంగు జారితే తెలిసిందీ పిల్ల గాలి వీచిందనీ..
ఈ సిగ్గు బరువు నేనోపలేను …ఈ సిగ్గు బరువు నేనోపలేను
నీ కంటి పాపలో దాచుకో నన్నూ.. దాచుకో నన్నూ…
చిలకమ్మ పలికింది..చిగురాకు కులికింది
ముత్యాల మనసీయ్యరా… నీ తీపి ముద్దుల్లో ముంచెయ్యరా…
నీ తీపి ముద్దుల్లో ముంచెయ్యరా…
చరణం 2:
కోయిలమ్మ పాడితే తెలిసిందీ కొత్త ఋతువు వచ్చిందనీ…
ఆ ఆ..హా..హ..హా…ఆ..హ
కొండ వాగుదూకితే తెలిసిందీ.. కోడె వయసు పొంగిందనీ..
ఈ వయసు హోరు నేనాపలేను..ఈ వయసు హోరు నేనాపలేను
నీ కౌగిలింతలో దోచుకో నన్నూ…దోచుకో నన్నూ..
చిలకమ్మ పలికింది..చిగురాకు కులికింది
గోరొంక కూసింది..గోరింట పూసింది
చిరునవ్వు చిలికించవే నీ లేత సింగారమొలికించవే..
నీ తీపి ముద్దుల్లో ముంచెయ్యరా…
Chilakamma Palikindi Lyrics in Telugu